మెగా హీరోలకు( Mega Heroes ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.మెగా హీరోలు ఏ సినిమాలో నటించినా భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.
మెగా హీరోలు ప్రస్తుతం నటిస్తున్న అన్ని సినిమాల బడ్జెట్ ఏకంగా 2000 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.అయితే 2023 సంవత్సరంలో మెగా హీరోలే తోపులని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఒక విషయంలో మెగా హీరోలకు ఎవరూ సాటిరారని మరి కొందరు చెబుతున్నారు.
వాల్తేరు వీరయ్య,( Waltair Veerayya ) విరూపాక్ష,( Virupaksha ) బ్రో( Bro ) సినిమాలలో ఇంటర్వెల్ సీన్స్ అదుర్స్ అనేలా ఉన్నాయని ఈ సంవత్సరంలోని బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్ ఈ సినిమాలోనే ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మెగా ఫ్యామిలీ హీరోలు ఒక్కొక్కరు ఒక్కో జానర్ సినిమాలో నటించినా ఈ హీరోలు తమ సినిమాలలో ఇంటర్వెల్ సీన్ బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు.ఈ విషయంలో మెగా హీరోలను ఎంత పొగిడినా తక్కువేనని చెప్పవచ్చు.

మెగా ఫ్యామిలీ హీరోలంతా కలిసి కనిపించేలా ఒక భారీ మల్టీస్టారర్ ను( Multistarer Movie ) ప్లాన్ చేస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.వాల్తేరు వీరయ్య, విరూపాక్ష, బ్రో సినిమాలలో వాల్తేరు వీరయ్య, విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా బ్రో సినిమా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలైంది.ప్రస్తుతం మెగా హీరోలు నటిస్తున్న సినిమాలపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

సాయితేజ్,( Saitej ) పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాలు 2024 సంవత్సరంలో థియేటర్లలో విడుదల కానున్నాయి.చిరంజీవి( Chiranjeevi ) రెమ్యునరేషన్ 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ సైతం 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.సాయితేజ్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
ఈ హీరోల రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







