భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సీపీఐ పార్టీలో ముసలం మొదలైంది.పార్టీకి చెందిన ఎనిమిది మంది మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశం అయ్యారు.
కొత్తగూడెం నియోజకవర్గ స్థానం కూనంనేని సాంబశివరావుకు కాకుండా బీసీ అభ్యర్థి షాబీర్ పాషాకు కేటాయించాలని ఈ సమావేశంలో తీర్మానించారని తెలుస్తోంది.కూనంనేనికి పొత్తులో భాగంగా సీటు వచ్చినా లేక పార్టీ తరపున సీపీఐకి కేటాయించినా మూకుమ్మడి రాజీనామా చేస్తామని హెచ్చరించారు.
ఒక్క సీటు కోసం పొత్తులంటూ పార్టీ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని విమర్శించారు.స్వార్థ ప్రయోజనాల కోసం అమరుల త్యాగాలను, సిద్దాంతాలను తుంగలో తొక్కుతున్నారని ఈ నేపథ్యంలో కూనంనేనికి టికెట్ కేటాయించొద్దని డిమాండ్ చేశారు.