భారత సంతతి రచయిత్రికి ప్రతిష్టాత్మక బ్రిటీష్ అకాడమీ బుక్ ప్రైజ్.. !!

భారత సంతతి రచయిత్రి నందినీ దాస్‌( Nandini Das )కు 2023వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక బ్రిటీష్ అకాడమీ బుక్ ప్రైజ్ లభించింది.సమాజంలో సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తున్నందుకు గాను నందినీకి ఈ బహుమతిని ప్రదానం చేశారు.అవార్డ్ కింద ఆమెకు 25 వేల పౌండ్లు (భారత కరెన్సీలో రూ.25 లక్షలు) అందజేశారు.నందినీ దాస్ నటించిన ‘‘కోర్టింగ్ ఇండియా : ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్’’ పుస్తకం .అవార్డ్‌కు ఎంపికైంది.ఈ అవార్డ్‌ను ప్రారంభించి 11 ఏళ్లు గడుస్తోంది.నామినేట్ చేయబడిన రచన ఆంగ్లంలో వుండి, యూకేలో ప్రచురించబడితే పరిగణనలోనికి తీసుకుంటారు.ప్రపంచ సంస్కృతుల గురించి పరస్పరం అనుసంధానించే మార్గాలపై ప్రజల అవగాహనకు అత్యుత్తమ సహకారం అందించిన నాన్ ఫిక్షన్ పరిశోధన ఆధారిత రచనలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.

 Meet India-born Author Nandini Das: The Winner Of 2023 British Academy Book Priz-TeluguStop.com
Telugu Boston, Britishacademy, Canada, India Born, Indian, Jadavpur, Oxd-Telugu

ఇకపోతే.నందినీ దాస్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ( University of Oxford )లో ఇంగ్లీష్ ఫ్యాకల్టీలో ఎర్లీ మోడరన్ లిటరేచర్ అండ్ కల్చర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.భారత్‌లో పుట్టి పెరిగిన ఆమె కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో చదువుకున్నారు.

అనంతరం ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లారు.మంజప్రా కెనడా( Canada )లో పెరిగారు.

ప్రస్తుతం మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో హిస్టరీ అండ్ గ్లోబల్ స్టడీస్‌లో స్టెర్న్స్ ట్రస్టీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.అక్టోబర్ 31న లండన్‌లో జరిగే కార్యక్రమంలో బ్రిటీష్ అకాడమీ బుక్ ప్రైజ్ విజేతను ప్రకటించనున్నారు.

షార్ట్ లిస్ట్ కాబడిన ప్రతి రచయితకు 1000 పౌండ్లను అందజేస్తారు.

Telugu Boston, Britishacademy, Canada, India Born, Indian, Jadavpur, Oxd-Telugu

ఇతర రచయితల విషయానికి వస్తే.ఫ్రాన్స్‌కు చెందిన డేనియల్ ఫోలియార్డ్, యూకేకు చెందిన తానియా బ్రానిగన్, స్పెయిన్‌కు చెందిన ఐరీన్ వల్లేజో, అమెరికాకు చెందిన దిమిత్రిస్ జిగలాటాస్‌లు బ్రిటీష్ అకాడమీ బుక్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు.నందినీ దాస్ ఈ అవార్డ్‌ను అందుకోవడం పట్ల బ్రిటన్‌లోని ఇండియన్ కమ్యూనిటీ, రచయితలు, సాహితీవేత్తలు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube