ప్రస్తుత రోజుల్లో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి.టెక్నాలజీ పరంగా చాలామంది మోసపోతున్నారు.
అగంతకులకు ఓటీపీలు చెప్పేసి డబ్బులు పోగొట్టుకొని చాలామంది బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు.ఈ క్రమంలో అనేక బ్యాంకులు తమ ఖాతాదారులను.అప్రమత్తం చేస్తూ ఓటీపీలు.ఎవరికీ చెప్పకూడదని సందేశాలు పంపుతూనే ఉన్నాయి.ఇదిలా ఉంటే నరసాపురంలో( Narasapuram ) ఎస్బిఐలో( SBI ) ఏకంగా బ్యాంక్ మేనేజర్ ని బురిడీ కొట్టించి ఓ దుండగూడు ఏకంగా ఆరు లక్షలకు పైగా డబ్బులు దోచుకెళ్ళిపోయాడు.ఈ తతంగం మొత్తం బ్యాంకు సీసీ కెమెరాలలో రికార్డు కావడంతో పోలీసులు దుండగుడిని పట్టుకోవడానికి గాలిస్తున్నారు.

ఆ సీసీ కెమెరాలలో నిందితుడు బ్యాగ్ తో బ్యాంకులోకి వచ్చిన దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి.ముఖానికి మాస్క్.టోపీ పెట్టుకుని వచ్చాడు.ఈ క్రమంలో వస్తు బ్యాగ్ లో కత్తి తెచ్చుకోవడం జరిగింది.అనంతరం క్యాబిన్ లో ఉన్న మేనేజర్( Bank Manager ) దగ్గరికి వెళ్లి బ్యాగ్ లో ఉన్న కత్తి తీసి బెదిరించి టేబుల్ పై ఉన్న 6.50 లక్షలు ఉడాయించాడు.దీంతో సీసీ కెమెరాలు ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు.పట్టపగలు అందరూ బ్యాంకులో పనిచేస్తూ ఉండగానే ఈ ఘటన జరగటంతో స్థానికంగా సంచలనంగా మారింది.







