చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషం వ్యక్తం చేసిన తుమ్మల నాగేశ్వరరావు..!!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో( Skill Development Case ) రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజులు ఉన్న చంద్రబాబు బెయిల్ పై( Chandrababu Bail ) బయటకు రావడం తెలిసిందే.జైలు నుంచి చంద్రబాబు బయటకు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 Thummala Nageswara Rao Expressed Happiness That Chandrababu Got Bail Details, Td-TeluguStop.com

ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు( Thummala Nageswara Rao ) చంద్రబాబుకి బెయిల్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఖమ్మం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తనకి రాజకీయ బిక్ష పెట్టారని చెప్పుకొచ్చారు.

చంద్రబాబుకి( Chandrababu ) బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని స్పష్టం చేశారు.రాబోయే ఎన్నికలలో తన గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ( TDP ) కార్యకర్తలు సహకరించాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉంటే చంద్రబాబు కాన్వాయ్ రెండు గంటలైనా గాని రాజమండ్రి దాటలేదు.

దారి పొడవునా భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు.ఈ క్రమంలో కారు లోపల నుంచే చంద్రబాబు అభివాదం చేస్తున్నారు.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube