చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషం వ్యక్తం చేసిన తుమ్మల నాగేశ్వరరావు..!!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో( Skill Development Case ) రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజులు ఉన్న చంద్రబాబు బెయిల్ పై( Chandrababu Bail ) బయటకు రావడం తెలిసిందే.

జైలు నుంచి చంద్రబాబు బయటకు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు( Thummala Nageswara Rao ) చంద్రబాబుకి బెయిల్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ఖమ్మం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తనకి రాజకీయ బిక్ష పెట్టారని చెప్పుకొచ్చారు.

"""/" / చంద్రబాబుకి( Chandrababu ) బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని స్పష్టం చేశారు.

రాబోయే ఎన్నికలలో తన గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ( TDP ) కార్యకర్తలు సహకరించాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు కాన్వాయ్ రెండు గంటలైనా గాని రాజమండ్రి దాటలేదు.దారి పొడవునా భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు.

ఈ క్రమంలో కారు లోపల నుంచే చంద్రబాబు అభివాదం చేస్తున్నారు.ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

నాలుగు లవంగాలతో ఇలా చేశారంటే మీ దంతాలు తెల్లగా మెరిసిపోవడం ఖాయం!