ఆ హీరోయిన్ చేతుల మీదగా మరో చేపల పులుసు బ్రాంచ్ ప్రారంభించబోతున్న కిరాక్ ఆర్పీ!

జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కిరాక్ ఆర్పి (Kirak Rp) ఒకరు.జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో తన కామెడీతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.

 Kirak Rp Start New Branch Of Nellore Peddareddy Chepalapulusu Details, Kiraak Rp-TeluguStop.com

అయితే అర్పీ ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్న ఈయన రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఇలా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు( Nellore Peddareddy Chepalapulusu ) రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు.

హైదరాబాద్లో ఇప్పటికే ఎన్నో బ్రాంచ్లను ఏర్పాటు చేసిన ఆర్పీ బిజినెస్ లో మాత్రం దూసుకుపోతున్నారు.కేవలం హైదరాబాదులో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈయన ఇప్పటికే ఎన్నో బ్రాంచ్లను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.

Telugu Mehreen, Kiraak Rp, Kirrakrp, Mahreen, Nellorepedda, Branch, Tirupathi-Mo

ఈ విధంగా రోజురోజుకు తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన త్వరలోనే మరొక బ్రాంచ్ ఏర్పాటు చేయబోతున్నారు.ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అనంతపురంలో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసినటువంటి ఆర్పి త్వరలోనే తిరుపతిలో ( Tirupati ) మరొక బ్రాంచ్ ఏర్పాటు చేయబోతున్నారు.ఈ బ్రాంచ్ ప్రముఖ హీరోయిన్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.నవంబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుపతిలో ఈయన కొత్త బ్రాంచ్ ప్రారంభం కాబోతోంది.

Telugu Mehreen, Kiraak Rp, Kirrakrp, Mahreen, Nellorepedda, Branch, Tirupathi-Mo

ఈ చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించడానికి ప్రముఖ హీరోయిన్ మెహరీన్ (Mehreen) హాజరు కాబోతున్నారు.ఇలా రెండో తెలుగు రాష్ట్రాలలోనూ ఆర్పీ తన రెస్టారెంట్ బిజినెస్ విస్తరింప చేస్తున్నారు.జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చినటువంటి ఈయన ఆ కార్యక్రమం పై ఎన్నో రకాల ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఆ కార్యక్రమం నుంచి బయటకు వచ్చినటువంటి ఆర్పి ఇతర బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసిన పెద్దగా క్లిక్ కాకపోవడంతో ఈయన బుల్లితెరకే దూరమై ఏకంగా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు.

ఈ బిజినెస్ రంగంలో మాత్రం మంచి సక్సెస్ అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube