ఆ హీరోయిన్ చేతుల మీదగా మరో చేపల పులుసు బ్రాంచ్ ప్రారంభించబోతున్న కిరాక్ ఆర్పీ!

జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కిరాక్ ఆర్పి (Kirak Rp) ఒకరు.

జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో తన కామెడీతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.

అయితే అర్పీ ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్న ఈయన రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఇలా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు( Nellore Peddareddy Chepalapulusu ) రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు.

హైదరాబాద్లో ఇప్పటికే ఎన్నో బ్రాంచ్లను ఏర్పాటు చేసిన ఆర్పీ బిజినెస్ లో మాత్రం దూసుకుపోతున్నారు.

కేవలం హైదరాబాదులో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈయన ఇప్పటికే ఎన్నో బ్రాంచ్లను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.

"""/" / ఈ విధంగా రోజురోజుకు తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన త్వరలోనే మరొక బ్రాంచ్ ఏర్పాటు చేయబోతున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అనంతపురంలో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసినటువంటి ఆర్పి త్వరలోనే తిరుపతిలో ( Tirupati ) మరొక బ్రాంచ్ ఏర్పాటు చేయబోతున్నారు.

ఈ బ్రాంచ్ ప్రముఖ హీరోయిన్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.నవంబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుపతిలో ఈయన కొత్త బ్రాంచ్ ప్రారంభం కాబోతోంది.

"""/" / ఈ చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించడానికి ప్రముఖ హీరోయిన్ మెహరీన్ (Mehreen) హాజరు కాబోతున్నారు.

ఇలా రెండో తెలుగు రాష్ట్రాలలోనూ ఆర్పీ తన రెస్టారెంట్ బిజినెస్ విస్తరింప చేస్తున్నారు.

జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చినటువంటి ఈయన ఆ కార్యక్రమం పై ఎన్నో రకాల ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఆ కార్యక్రమం నుంచి బయటకు వచ్చినటువంటి ఆర్పి ఇతర బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసిన పెద్దగా క్లిక్ కాకపోవడంతో ఈయన బుల్లితెరకే దూరమై ఏకంగా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు.

ఈ బిజినెస్ రంగంలో మాత్రం మంచి సక్సెస్ అందుకున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!