హైదరాబాద్:అక్టోబర్ 30 తెలంగాణ( Telangana )లోని నక్సల్స్ ప్రభావం ఉన్న 13 నియోజకవర్గాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగించనున్నట్లు ఈసీ తెలిపింది.సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్ జరగనున్నట్లు తెలిసింది.
మిగతా 106 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది.ఈ మేరకు నోటిఫికేన్ జారీ చేసింది.
నవంబర్ 30వ తేదీన జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇవాళ ఎన్నికల నిర్వహణపై ఈసీఐ రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు, నగదు సీజ్‌పై ఈసీ ఆరా తీయగా ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో వికాస్ రాజ్( CEO Vikas Raj ) ఈసీఐకి వివరాలు వెల్లడించారు.
ఎన్నికల కు సంబంధించిన నియమావళి పై అధికారులకు ఈసీఐ పలు సూచనలు చేసింది.,
.






