మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ మరియు దుబ్బాక ఎమ్యెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై( Kotha Prabhakar Reddy ) గుర్తు తెలియని ఆగంతకులు కత్తి తో పొడిచిన ఘటన తెలంగాణ లో ఇప్పుడు కలకలం రేపింది.చనిపోయిన ఒక పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వస్తున్న సమయం లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
అధికార పార్టీ కి సంబంధించిన అభ్యర్థి పై ఇలా దాడి చెయ్యడం అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.తీవ్రమైన గాయాల పాలైన ప్రభాకర్ రెడ్డి ని ప్రధమ చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి( Gajwel Hospital ) తరలించారు.
ప్రస్తుతానికి ఆయన పరిస్థితి విషమం గానే ఉందని, ఈ దుర్ఘటన జరిగిన వెంటనే ఆయనని హాస్పిటల్ కి తీసుకొని రావడం చాలా మంచిది అయ్యిందని అక్కడి డాక్టర్లు చెప్తున్నారు.
మరో పక్క ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ఈ సంఘటన జరగడానికి గల కారణాలను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి హరీష్ రావు( Harish Rao ) గజ్వేల్ హాస్పిటల్ కి వెళ్లి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ని తెలుసుకున్నారు.త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కూడా గజ్వేల్ ఆసుపత్రికి చేరుకొని ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం పై ఆరాలు తియ్యనున్నారు.
ఇంతకీ ఇంతటి దుస్సాహసానికి ఒడి గట్టిన ఆ రాజు ( Raju ) అనే వ్యక్తి ఎవరు?, కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన వాడా?, లేదా బీజేపీ పార్టీ కి సంబంధించిన వాడా? అనేది తెలియాల్సి ఉంది.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేల, పటిష్టమైన బందోబస్తుని దాటుకొని ప్రజా ప్రతినిధులపైనే ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి అంటే, రాబొయ్యే రోజుల్లో సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఒక ఎంపీ పై సాధారణ వ్యక్తి దాడి అంటే మామూలు విషయం కాదు, ఇది నిజంగానే ప్రతిపక్ష పార్టీలకు( Opposition Parties ) సంబంధించిన వాళ్ళు చేసారా?, లేకపోతే సానుభూతి కోసం ప్రభాకర్ రెడ్డి గారే ఈ పని చేయించుకున్నారా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే ఎన్నికల కంటే తెలంగాణ లో జరిగే ఎన్నికల సమయం లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం గతం లో కూడా మనం చాలానే చూసాము.రాజకీయాలు ఇంత నీచంగా ఉంటాయా అని కొన్ని సంఘటనలు చూసి అనుకున్న రోజులు కూడా ఉన్నాయి.ఇప్పటి నుండి సరిగ్గా నెల రోజులు ఎన్నికలకు సమయం ఉంది, ఈ నెల రోజుల్లో పోలీసులు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాలి.







