ఓ వివాహితను బెదిరించి, ఆమె కూతురు ముందే వాలంటీర్( Volunteer ) పలుమార్లు వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో( Anantapur ) చోటుచేసుకుంది.ఈ ఘటన వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
అనంతపురం జిల్లా యాడికి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత యాడికి లోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది.ఈమె తన భర్త,ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తోంది.
అయితే యాడికి మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన దాసరి సతీష్( Dasari Satish ) అనే యువకుడు గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు.గత మూడు నెలలుగా ఆ వివాహిత ఇంటికి తరచూ వెళ్తూ వస్తూ ఉండడంతో సతీష్ కు అ వివాహితతో మంచి పరిచయం ఏర్పడింది.
ఈనెల ఏడవ తేదీ ఎప్పటిలాగే ఆ వివాహిత తన ఆరేళ్ల కూతురుతో కలిసి యాడికి లోని తాను పనిచేసే బట్టల దుకాణానికి వెళ్ళింది.ఆ సమయంలో గ్రామ వాలంటీర్ దాసరి సతీష్ అక్కడికి వచ్చి ఆ వివాహితతో తన కోరికను తీర్చాలని, లేకపోతే భర్త, పిల్లలను హతమారుస్తానని బెదిరించాడు.

తనతో పాటు తీసుకువచ్చిన కారులో బలవంతంగా ఆ వివాహితను( Married Woman ) ఆమె ఆరేళ్ల చిన్నారిని ఎక్కించుకొని స్థానికంగా ఉండే తన రూమ్ కి తీసుకెళ్లాడు.రెండు రోజులపాటు ఆ రూమ్ లో వివాహితపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఒక కారు అద్దెకు తీసుకుని ఈనెల తొమ్మిదవ తేదీ తిరుపతికి( Tirupati ) తీసుకువెళ్లి అక్కడ ఒక గది అద్దెకు తీసుకొని వివాహిత కుమార్తె ముందే వివాహితపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.బాధితురాలు తన నుండి తప్పించుకోవడానికి వీలు లేకుండా బయటకు వెళ్లే ప్రతిసారి తాళం వేసి వెళ్లేవాడు.

మరోవైపు ఏడవ తేదీ నుంచి వివాహిత, చిన్నారి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు 11వ తేదీ యాడికి పోలీస్ స్టేషన్ లో( Yadiki Police Station ) ఫిర్యాదు చేశారు.మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసి తిరుపతి పోలీసుల సహాయంతో బాధితురాలిని ఈనెల 25వ తేదీ బాధితుడి నుండి విముక్తి కల్పించారు.నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.







