గతంలో ఓ ఇంటర్వ్యూలో భారత రాష్ట్రపతి ఎవరు అనే సమాధానానికి టాప్ హీరోయిన్ ఆలియా భట్( Alia Bhatt ) తనకు తెలియదని సమాధానం చెప్పింది.ఇలా ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే పేర్లు కూడా తెలియని ప్రజలు ఉంటారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది అమాయక ప్రజలు ఉంటారు.వారిలో ఎక్కువ మంది నిరక్షరాశ్యులు లేదా తక్కువ చదువుకున్న వారు ఉంటారు.
వారికి రాజకీయాల పట్ల అవగాహన కొంచెం తక్కువగా ఉంటుంది.అయితే చదువుతో సంబంధం లేకపోయినా అంతర్జాతీయ స్థాయిలో రాజకీయాలు గురించి చర్చించే వారు కూడా ఉంటారు.
అందుకే ఎవరినీ తక్కువ చేయలేం.ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections in Telangana ) జరుగుతున్నాయి.
ఓటర్ల నాడి తెలుసుకునేందుకు వివిధ పత్రికలు, ఛానళ్లు సర్వేలు చేపడుతున్నాయి.ఈ క్రమంలో ఓ ఆసక్తికర వీడియో వైరల్ అవుతోంది.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని( Rajendranagar Constituency ) ఓ గ్రామంలో ఓ టీవీ ఛానల్ ఇటీవల సర్వే చేపట్టింది.ఆ సమయంలో ఇంట్లో గిన్నెలు తోముతున్న ఓ మహిళను రిపోర్టర్ పలకరించాడు.
మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా అని ఆమెను అడిగాడు.దానికి తనకు తెలియదు అని ఆమె బదులిచ్చింది.
మంత్రి ఎవరో తెలుసా అని అడిగితే తన అత్తగారికి తెలుసు అని పేర్కొంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలుసా అని అడగగా తనకు తెలియదని కొత్తగా పెళ్లి అయిందని ఆమె జవాబు ఇచ్చింది.దీంతో ఆ రిపోర్టర్ అవాక్కయ్యాడు.ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అవుతోంది.
కొత్తగా పెళ్లి అవడానికి, సీఎం పేరు తెలియకపోవడానికి సంబంధం ఏమిటో అని నెటిజన్లు నవ్వుకుంటున్నారు.సీఎం కేసీఆర్ అంటే తెలియని వారు ఉండరని అంతా అనుకుంటారని, కానీ ఆయన కూడా తెలియని ప్రజలు తెలంగాణలో ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం ఎలక్షన్ సీజన్ కావడంతో ఈ వీడియో మరింత వైరల్ అవుతోంది.