ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారు..: మాజీ ఎంపీ పొంగులేటి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.

 Kcr Is Making A Mockery Of Democracy..: Former Mp Ponguleti-TeluguStop.com

కేసీఆర్ మసిపూసి మారెడు కాయ చేస్తున్నారని పొంగులేటి విమర్శించారు.హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే గతంలో దళితబంధు తెచ్చారన్న ఆయన కాంగ్రెస్ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని తెలిపారు.

ధనిక రాష్ట్రాన్ని దోచుకుని దేశంలో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు ఏటీఎం లాంటిదని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు అమలు చేయాలనే కాంగ్రెస్ కోరుతోందని స్పష్టం చేశారు.ఈ క్రమంలో ఈసారి తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube