తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.మేడిగడ్డ ప్రాజెక్టును జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ బృందం పరిశీలించిందని తెలిపారు.
లోపం ఏంటనేది డ్యామ్ సేప్టీ అథారిటీ బృందం చెబుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.ఏం లోపం ఉన్నా ఏజెన్సీనే పునరుద్ధరిస్తుందని తెలిపారు.
తెలంగాణ ప్రజలపై పైసా భారం పడదని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ఐదేళ్లు అయిందన్న మంత్రి కేటీఆర్ గతంలో 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ప్రాజెక్టు తట్టుకుందని పేర్కొన్నారు.
అన్నారంలో పంపు హౌజ్ మునిగితే ప్రాజెక్టే మునిగిపోయిందని ప్రచారం చేసి ప్రతిపక్షాలు పైశాచిక ఆనందం పొందాయని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టులో రూపాయి కూడా సీఎం కేసీఆర్ వృథా చేయలేదని చెప్పారు.
ఎన్నికలు వస్తున్నాయని బట్ట కాల్చి మీద వేస్తున్నారని మండిపడ్డారు.
.






