ఉద్యోగం దొరకలేదని ఒత్తిడి, ఉద్యోగం దొరికాక ఆఫీస్ లో ఒత్తిడి కారణంగా చాలా మంది పురుషులు స్మోకింగ్, డ్రింకింగ్ వంటివి అలవాటు చేసుకుంటారు.వీటికి తోడు పెరిగిన కాలుష్యం, పోషకాల కొరత, ఫోన్ లాప్ టాప్స్ నుంచి వచ్చే రేడియేషన్ హెయిర్ ఫాల్ ను తీవ్రంగా మారుస్తాయి.
ఈ క్రమంలోనే రోజు రోజుకి జుట్టు పల్చగా మారుతుంటుంది.అయితే పల్చటి జుట్టుతో బాధపడే పురుషులకు ఒక బెస్ట్ రెమెడీ ఉంది.
ఈ రెమెడీని పాటిస్తే కొద్ది రోజుల్లోనే జుట్టు ఒత్తుగా మారుతుంది.రిజల్ట్ చూసి వావ్ అని మీరే అంటారు.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ లో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి.అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని స్టైనర్ సహాయంతో రైస్ మిల్క్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, మూడు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పౌడర్( Amla Powder ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ) వేసుకుని కలుపుకోవాలి.

చివరిగా రైస్ మిల్క్( Rice milk ) ను సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పాటించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు పురుషులు ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.అదే సమయంలో జుట్టు రాలడం ఆగుతుంది.కొద్దిరోజుల్లోనే పల్చటి జుట్టు ఒత్తుగా మారుతుంది.కాబట్టి ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.







