టాలీవుడ్ సెలబ్రిటీస్ లలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో నితిన్ కచ్చితంగా ఉంటారు.యూత్ ఫుల్ సబ్జక్ట్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నితిన్ కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.
అలాంటి హీరో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి వీరాభిమాని అవ్వడం, హిట్స్ మరియు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ని విపరీతంగా ఆరాధించడం నితిన్ స్టైల్.ఈయన ట్విట్టర్ అకౌంట్ ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, ఆయన కలెక్షన్స్ మరియు స్టామినా గురించి వేసిన ట్వీట్స్ కనిపిస్తాయి.
ప్రతీ సినిమాలోనూ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎదో రిఫరెన్స్ సన్నివేశం పెట్టుకునే అలవాటు ఉన్న నితిన్,( Nithin ) ఆయన లేటెస్ట్ చిత్రం ‘ఎక్స్ట్రార్డినరీ మ్యాన్’ చిత్రం( Extra Ordinary Man ) లో కూడా పవన్ కళ్యాణ్ ని ఫుల్లుగా వాడేసాడు.
మరోనాలుగు రోజుల్లో ఈ సినిమాకి సంబందించి టీజర్ ని విడుదల చెయ్యబోతున్నారు.ఈ సందర్భంగా టీజర్ లోని చిన్న షాట్ కి సంబంధించిన ఫోటో ని సోషల్ మీడియా లో విడుదల చేసారు.ఈ ఫొటోలో నితిన్ పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రం( BRO The Avatar ) లో గెటప్ ని అనుసరిస్తూ ఫోజు ఇస్తాడు నితిన్.
ఇంతకు ముందుతో పోలిస్తే నితిన్ ఈ మధ్య పెద్దగా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ సన్నివేశాలు తన సినిమాల్లో పెట్టడం బాగా తగ్గించాడు.చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ తో మన ముందుకు వస్తున్నాడు.
అయితే ఈ స్టిల్ ని చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు మురిసిపోగా, ఇతర హీరోల అభిమానులు మాత్రం నితిన్ ఇంకా భజన ఆపలేదు అంటూ కామెంట్స్ చేసారు.దీనిపై అప్పట్లో నితిన్ ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇస్తాడు.
ఆయన మాట్లాడుతూ ‘చాలా మంది నన్ను పవన్ కళ్యాణ్ గారికి భజన చేస్తానని అంటుంటారు, కొంతమంది అయితే నేను పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ని వాడుకుంటున్నాను అని అంటారు, కానీ నిజ నిజానికి నేను పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే వీరాభిమానిని, నేను ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.ఆయన సినిమా విడుదలైతే ఒక మామూలు అభిమాని కి ఎలాంటి అనుభూతి కలుగుతుందో, నాకు కూడా అలాంటి అనుభూతి కలుగుతుంది.తమ అభిమాన హీరో సినిమా హిట్ అయితే ఎంతలా ఆనందం వస్తుందో, పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయ్యినప్పుడు నాకు అలాంటి సంతోషమే వచ్చేది.ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఫ్లాప్ అయ్యినప్పుడు ఏడ్చాను కూడా.
జానీ, పులి , అజ్ఞాతవాసి సినిమాలు( Agnyaathavaasi ) ఫ్లాప్ అయ్యినప్పుడు చాలా ఏడ్చాను’ అంటూ నితిన్( Nithin ) ఆ ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు.






