రాజన్న సిరిసిల్ల జిల్లా: రైతుబంధు నిలుపువేయాలని ఎన్నికల కమిషనర్ కు పిర్యాదు చేసిన రైతుల వ్యతిరేకి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ( TPCC President Revanth Reddy )అని జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఆరోపించారు.ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు నిప్పులు చేరుగుతూ మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోస్తే రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని ప్రగల్భాలు పలికే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద రైతులకు హార్దిక సహాయాన్ని ఇస్తే చూసి ఓర్వలేక నిలిపివేయాలని ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసిన బద్ధ వ్యతిరేకి రేవంత్ రెడ్డి అని ఆయన విమర్శించారు.తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజలకు ఇంటింటికి ప్రభుత్వ సహాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే కేసిఆర్ అని వారు గుర్తు చేశారు.
సబ్బండ వర్గాల ప్రజలు నవంబర్ 30న జరిగే శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ మద్దతు గా కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపించుకోవాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి పిల్లి రేణుక కిషన్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందె సుభాష్ సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎఎంసి మాజీ చైర్మన్ గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, సింగిల్ విండో ఉపాధ్యక్షులు జంగిడి సత్తయ్య , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మధు , బిఆర్ ఎస్ పార్టీ నాయకులు.
రాజు నాయక్, వరద సతీష్, అజ్మీర తిరుపతి నాయక్ , నాయకులు హాసన్ బాయి, రాజు , అనిల్ , ప్రమోద్ , ముందటి రాము , పసుల భాస్కర్ , సిరికొండ నాగరాజు గన్నమనేని సుధాకర్ రావు , సురభి కాంతారావు , కాలు నాయక్, ప్రమోద్ బంటీ గౌడ్ , బిఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.