స్కిల్ డెవలప్మెంట్ కేసు లో A1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) గత నెల రోజుల పైనుండి రాజమండ్రి జైలు లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.ఎన్ని సార్లు హై కోర్టు లో బెయిల్ కోసం దరఖాస్తు చేసినా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి.
మర్డర్లు మరియు మానభంగాలు చేసేవాళ్ళు సైతం జైలు నుండి బెయిల్ తీసుకొని విడుదల అవుతున్న ఈ రోజుల్లో చంద్ర బాబు నాయుడు కి బెయిల్ దక్కకపోవడం గమనార్హం.ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమంత్రి జగన్( CM Jagan ) కజిన్ వై ఎస్ వివేకా( YS Viveka ) కేసులో ప్రధమ నిందితుడు అని సిబిఐ అధికారులు ఆధారాలతో సహా బయటపెట్టినా కూడా అతన్ని జగన్ కాపాడడం వల్ల ఇంకా అతను బయటే ఉన్నాడు.
ఇదంతా గమనించిన జనం చంద్రబాబు పై జగన్ కావాలని కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నాడు అని అంటున్నారు.ఆయన పై ప్రజల్లో సానుభూతి బలంగానే పెరిగింది.అయితే రాజమండ్రి జైలులో( Rajahmundry Jail ) చంద్రబాబు ని పోలీస్ అధికారులు ట్రీట్ చేస్తున్న విధానం ఏమి బాగాలేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.70 ఏళ్ళు పైబడిన వ్యక్తి అయినా చంద్రబాబు కి ఎండ తీవ్రత తట్టుకోలేక స్కిన్ ఎలెర్జి కి( Skin Allergy ) సంబంధించిన వ్యాధి రావడం తో వెంటనే డాక్టర్లు వచ్చి ఆయనకీ అత్యవసర చికిత్స అందించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆ తర్వాత కోర్టు ఇచ్చిన ప్రత్యేకమైన అనుమతి ద్వారా చంద్రబాబు కి ఏసీ ని ఏర్పాటు చేసారు.ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు తనకి ప్రాణహాని ఉందంటూ హై కోర్టు జడ్జికి లేఖ రాయడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.గుహ కొద్దీ రోజులుగా జైలు లో జరుగుతున్న కొన్ని సంఘటనలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి.స్పై కెమెరాలు మరియు పెన్ కెమెరాలతో తెలుగు దేశం పార్టీ( TDP ) కార్యక్రమాలను రహస్యంగా చిత్రీకరిస్తున్నారు.

అంతేకాదు తనకి నక్సల్స్ నుండి ప్రాణహాని ఉందని, తనని చంపడానికి కుట్రలు చేస్తున్నారని, తనకి భద్రతా కల్పించాల్సిన అవసరం చాలా ఉందంటూ చంద్రబాబు నాయుడు జడ్జీ కి లేఖ రాసాడు.చంద్రబాబు నుండి స్వయంగా ఇలాంటి మాటలు రావడం తో తెలుగు దేశం పార్టీ క్యాడర్ మరియు పార్టీ నాయకులూ ఆందోళన చెందుతున్నారు.చంద్రబాబు శరీరం పై చిన్న గీత పడినా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రెసిడెంట్ రూల్ వచ్చే రేంజ్ లో గొడవలు జరుగుతాయి, దానికి సీఎం జగన్ బాధ్యత వహించాల్సి వస్తుంది అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులూ వార్ణింగ్స్ ఇస్తున్నారు.







