కీలకమైన ఎన్నికల సమయంలో తెలంగాణ బిజెపి( Telangana BJP )లో పరిస్థితులు ఆందోళనకరంగా మారింది.పార్టీకి చెందిన కీలక నేతలు రకరకాల కారణాలతో అసంతృప్తికి గురై పార్టీ మారుతూ ఉండడంతో, తెలంగాణలో బిజెపి రోజురోజుకు బలహీన పడుతోంది అనే ప్రచారం తీవ్రతరం అవుతోంది.
ప్రజల్లోనూ బిజెపి బలహీనమైందనే అభిప్రాయాలు కలుగుతుండడం, కీలక నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరుతుండడంతో , వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ అంతా కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీల మధ్యనే ఉంటుందనే ప్రచారం తీవ్రతరం అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర బిజెపి పెద్దలు తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
అసంతృప్త నేతలను బదిగించేందుకు రంగం సిద్ధం చేశారు.ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో జరగబోయే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.
నిన్న రాత్రికే అమిత్ షా తెలంగాణకు చేరుకున్నారు.

నేషనల్ పోలీస్ అకాడమీలో బస చేశారు .ఈరోజు నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ ఫెరైడ్ లో పాల్గొంటారు.ఆ తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్ లో సూర్యాపేటకు బయలుదేరి వెళ్తారు .సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు సూర్యాపేట బిజెపి ఎన్నికల ప్రచారం సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.45 గంటలకు హైదరాబాద్( Hyderabad ) నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.అయితే సూర్యాపేట పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కాబోతున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ అభ్యర్థుల మొదటి విడత జాబితా తరువాత తలెత్తిన పరిస్థితులు , పార్టీ నుంచి వలసలు ఎక్కువ అవ్వడం వీటన్నిటి పైన అమిత్ షా( Amit Shah ) చర్చించి వలసలు నిరోధించేందుకు ఏమేం చేయాలనే దానిపైన సూచనలు చేయబోతున్నట్లు సమాచారం.అలాగే అసంతృప్తి మేతలను ఢిల్లీకి పిలిపించి బజ్జుగించే ప్రయత్నాలు మొదలుపెట్టబోతున్నారట.







