ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకువచ్చే పేరు శ్రీలీల.( Sreeleela ) ఈమె పెళ్ళిసందడి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తర్వాత ‘ధమాకా’ చిత్రం తో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ప్రస్తుతం ఈమె చేతిలో డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.‘ధమాకా’ చిత్రం తర్వాత ఆమె చేసిన ‘స్కంద’ చిత్రం( Skanda ) పెద్ద ఫ్లాప్ అయ్యింది కానీ, ఆ తర్వాత వెంటనే విడుదలైన ‘భగవంత్ కేసరి’ చిత్రం( Bhagavanth Kesari ) మాత్రం పెద్ద హిట్ అయ్యింది.దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దసరా విజేతగా నిల్చింది.దసరా అయిపోయి రెండు రోజులు పూర్తి అయినా కూడా ఈ చిత్రానికి అన్నీ ప్రాంతాలలో హౌస్ ఫుల్స్ పడుతూనే ఉన్నాయి.

ఇక పోతే వచ్చే నెలలో ఆమె హీరోయిన్ గా నటించిన మరో చిత్రం ‘ఆదికేశవ్‘ ( AadiKeshav )విడుదలకు సిద్ధంగా ఉంది.పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా నటించిన ఈ సినిమాకి సంబంధించిన మొదటి పాట నిన్న విడుదలైంది.ఈ పాటలో శ్రీలీల మరోసారి తన అద్భుతమైన డ్యాన్స్ తో దంచి కొట్టేసింది.ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రస్తుతం ఆమె పని చేస్తున్న హీరోలందరి గురించి ఒక్క మాటలో చెప్పాలని అంటుంది యాంకర్.
అప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చినప్పుడు ఆయన దైవం తో సమానం అంటూ కామెంట్ చేసింది.ఆయన చుట్టూ ఉండే ఆరా చాలా ప్రత్యేకమైంది, ఆయన్ని చూస్తే దేవుడిని చూసిన అనుభూతి కలుగుతుంది అంటూ చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడిన ఈ మాటలను సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

శ్రీలీల ప్రస్తుతం అందరి హీరోలతో కలిసి పనిచేస్తుంది, కానీ ఏ హీరో గురించి కూడా ఆమె ఇంత గొప్పగా మాట్లాడలేదు.అలాంటిది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ దైవం తో పోల్చింది అంటే ఆమెకి పవన్ కళ్యాణ్ ఎంతలా కనెక్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో ‘ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh )’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా ఇప్పటి వరకు మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంటే శ్రీలీల మూడు షెడ్యూల్స్ కూడా పాల్గొన్నది.ఈ చిత్రం తో పాటుగా ఆమె మహేష్ బాబు తో ‘గుంటూరు కారం’ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.







