టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) నిజం గెలవాలి కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో( Tirupati ) నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడటం జరిగింది.
ఈ సందర్భంగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో అనేక విషయాలకు సంబంధించి భువనేశ్వరి సమాధానాలు ఇవ్వటం జరిగింది.కుటుంబంలో నలుగురం నాలుగు దిక్కులైపోయాం.
మనవడు దేవాన్ష్ ను చూసి 48 రోజులయ్యింది.రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత భవిష్యత్ నాశనమైంది.
రాష్ట్రంలో హింస, అరాచకం రాజ్యమేలుతున్నాయి.

కాగా తన భర్త చంద్రబాబు( Chandrababu Naidu ) గురించి మాట్లాడుతూ ఆయన చాలా ధైర్యవంతుడని భువనేశ్వరి తెలిపారు.తన భర్త నుంచి ఓర్పు తాను నేర్చుకున్నట్లు స్పష్టం చేశారు.ఈ ముఖాముఖి కార్యక్రమంలో జనసేన మహిళ నేత పవన్( Pawan Kalyan ) మిమ్మల్ని కలిసినప్పుడు ఎలా అనిపించింది అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు భువనేశ్వరి సమాధానమిస్తూ పవన్ కళ్యాణ్ కలిసి బాగున్నారా అమ్మ అని ఆప్యాయంగా అడిగారు.ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాల గురించి చెప్పి తాను కూడా బాధపడటం జరిగింది.
ఆయన కూడా రాష్ట్రం గురించి ఆలోచన చేస్తున్నారు.కచ్చితంగా మా రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.







