గజ్వేల్ లో బీజేపీదే గెలుపు..: ఈటల రాజేందర్

హుజూరాబాద్ లాగానే గజ్వేల్ లోనూ కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.అయితే గతం తరహాలోనే గజ్వేల్ లో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

 Bjp's Victory In Gajwel: Etala Rajender-TeluguStop.com

గజ్వేల్ లో ప్రైవేట్ కంపెనీల కోసం పేదల భూములను ప్రభుత్వం లాక్కుందని ఈటల ఆరోపించారు.తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర అందరికీ తెలుసన్న ఈటల తెలంగాణ కోసం సమైక్య పాలకులతో కొట్లాడానని చెప్పారు.

అయితే తనపై నిందలు మోపి అన్యాయంగా బయటకు పంపించారని వాపోయారు.మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులు అడ్డా కూలీలుగా మారారన్న ఈటల ఓటేసిన పాపానికి వేలాది ఎకరాల భూములు లాక్కున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌలు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామన్న ఈటల రైతు కూలీలకు రూ.5 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube