ప్రస్తుతం రోడ్లపై ట్రాఫిక్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రతి వ్యక్తికి కారు లేదా బైక్ ఏదో ఒకటి కచ్చితంగా ఉంటుంది.
కాబట్టి రోడ్లపై సీనియర్ సిటిజన్లు కారు డ్రైవింగ్ చేయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న కార్లు తయారు చేసే ప్రముఖ కంపెనీలు సీనియర్ సిటిజన్లు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న కూడా సౌకర్యవంతంగా కారు నడపడం కోసం ఆటోమేటిక్ కార్లను మార్కెట్లోకి చేస్తున్నారు.
ట్రాఫిక్ లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా చాలా సులభంగా డ్రైవింగ్ చేయడానికి ఆటోమేటిక్ కార్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.అందుకే చాలామంది సీనియర్ సిటిజన్లు గేర్లెస్ మరియు క్లచ్ లెస్ కార్లు కొనడానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
భారతదేశం(India )లో గేర్లెస్ మరియు క్లచ్లెస్ కార్లలో
మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కార్లు
అధికంగా సేల్ అవుతున్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10:
సీనియర్ సిటిజన్లకు ఈ కారు ( Hyundai Grand i10 )ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్ ఇబ్బంది లేకుండా గేర్ మార్చుకునే అవకాశం అందిస్తుంది.సీనియర్లు రిలాక్స్డ్ పద్ధతిలో డ్రైవింగ్ చేయవచ్చు.
రద్దీగా ఉండే రోడ్లపై సీనియర్ సిటిజన్లకు ఈ కారు బెస్ట్ ఆప్షన్.స్టైలిష్ డిజైన్ అండ్ నెమ్మదిగిన పర్ఫామెన్స్ డ్రైవింగ్ చేయడం సీనియర్లకు చాలా సులభం.

మారుతి సుజుకి స్విఫ్ట్:
ఇది ఒక చిన్న హ్యాచ్ బ్యాక్( Maruti Suzuki Swift ) కారు.ఈ కారు అసౌకర్యం లేకుండా గేర్ మార్చుకునే ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చబడి ఉంటుంది.దీంతో ఈ కారు సీనియర్ల సిటీజన్లకు డ్రైవింగ్‌కు అనువైనది.కారులో విశాలమైన క్యాబిన్ కూడా అందించారు.వృద్ధ ప్రయాణీకులు సులభంగా ఎక్కవచ్చు, దిగవచ్చు.ఇంకా నమ్మదగిన పర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది.
ప్రస్తుత రోడ్లపై సీనియర్ సిటిజన్లు చాలా సౌకర్యవంతంగా డ్రైవింగ్ చేయడానికి ఈ రెండు కార్లు ఒక మంచి బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.







