తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.బీఆర్ఎస్ రైతులు, యువకులు, దళితులను మోసం చేసిందని ఆరోపించారు.
కౌలు రైతులను, నిరుద్యోగులను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కిషన్ రెడ్డి తెలిపారు.సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎరువులు అందిస్తోందని తెలిపారు.అంతేకాకుండా తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డు ప్రకటించారని తెలిపారు.