అక్టోబరు 7 నుంచి గాజాపై ఇజ్రాయెల్( Israel ) జరుపుతున్న వైమానిక దాడులు వందలాది మంది ప్రాణాలను తీసేసాయి.చనిపోయిన వారిలో చాలా మంది పేర్లు తెలుసుకోవడం కష్టతరమైంది.
వారిని సామూహిక సమాధులలో ఖననం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే వారి మృతదేహాలు గుర్తించలేని విధంగా దెబ్బతిన్నాయి.అయితే కొన్ని పాలస్తీనా కుటుంబాలు వైమానిక దాడుల్లో వారి బంధువులు దురదృష్టవశాత్తు చనిపోతే వారిని ఎలా గుర్తించాలో తాజాగా ఒక ఆలోచన చేశాయి.
వారు తమ పేర్లతో కంకణాలను ధరించాలని నిర్ణయించుకున్నారు.

తమతో పాటు తమ కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా చేతులపై సొంత పేరు గల బ్రాస్‌లెట్స్ ధరించాలని వారు ఆలోచన చేశారు.ఇలా చేతికి ఈ పేరు బ్రాస్‌లెట్ ఉంటే మృతదేహాలను ఈజీగా గుర్తించవచ్చు అని వారు భావిస్తున్నారు.దీని గురించి తెలిసి మిగతా ప్రపంచం మొత్తం ఎమోషనల్ అవుతోంది.
ఏడుగురు పిల్లల తండ్రి అయిన 40 ఏళ్ల అలీ ఎల్-దాబా రాయిటర్స్‌తో( Ali El-Daba with Reuters ) మాట్లాడుతూ, తన కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే తెలుసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నాడు.దాడుల్లో తన కుటుంబ సభ్యులు చనిపోలేదని నిర్ధారించుకోవడానికి ఐడీ బ్రాస్‌లెట్స్ ఉపయోగిస్తున్నామని పేర్కొన్నాడు.
అలాగే ఒకే దాడిలో అందరూ చనిపోయే ప్రమాదం లేకుండా తాను, తన భార్య లీనా కూడా తమ పిల్లలను వేరు చేసి వేర్వేరు ఆశ్రయాల్లో ఉంచాలని ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాడు.

లీనా, వారి నలుగురు పిల్లలు ఉత్తరాన ఉన్న గాజా ( Gaza )నగరంలో ఉన్నారు, అలీ, మిగిలిన ముగ్గురు దక్షిణాన ఖాన్ యూనిస్‌కు వెళ్లారు.హమాస్ నియంత్రణలో ఉన్న పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, అక్టోబర్ 7 నుంచి గాజాలో 6,500 మందికి పైగా మరణించారు.వారిలో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.
ఇజ్రాయెల్ గాజాపై తన దాడులను పెంచింది, భూ దండయాత్ర ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది.







