రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఎంపీ కోమటిరెడ్డి రియాక్షన్

బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా విషయం తనకు తెలియదని తెలిపారు.

 Mp Komati Reddy's Reaction On Rajagopal Reddy Affair-TeluguStop.com

రాజగోపాల్ రెడ్డి తనతో సంప్రదించలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తమలో ఎవరూ ముఖ్యమంత్రి అయినా ఆరు గ్యారెంటీలపైనే తొలి సంతకమని చెప్పారు.

ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎవరన్నది పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని తెలిపారు.తమ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అయిపోయిందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ కు 70 నుంచి 85 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.అదేవిధంగా రేపు రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల అవుతుందన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరు స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube