తగ్గేదే లే అంటున్న కాంగ్రెస్ సీనియర్లు - సీఎం సీటుపై పోటాపోటీ ప్రకటనలు!

తెలంగాణలో అధికారానికి కాంగ్రెస్ కు( Congress Party ) అవకాశం ఉందన్న సర్వే రిపోర్టులు రావడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి( CM Post ) ఆ పార్టీ లో ఆశావహుల హడావుడి పెరిగింది.నిన్న మొన్నటి వరకూ చప్పుడు చేయని నేతలు కూడా ఇప్పుడు తామే సీనియర్లమంటూ సీఎం డ్రీమ్ ను నెరవేర్చుకోవడానికి చూస్తున్నారు.

 T Congress Senior Leaders Competing For Cm Post Details, T Congress, T Congress-TeluguStop.com

క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన జానారెడ్డి( Janareddy ) కూడా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కు తానే పెద్ద దిక్కును అంటున్నారు.మరోవైపు రెండుసార్లు పిసిసి చీఫ్ పదవిని అలంకరించిన తన కన్నా ఎక్కువ అర్హత ఎవరికి ఉందంటూ ఉత్తంకుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) ప్రశ్నిస్తుంటే, రాహుల్ గాంధీ జోడో యాత్రకు అనుబంధ యాత్రలు చేసిన బట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) సైతం ఈసారి ముఖ్యమంత్రి పదవి దళితుడికేనని అది కూడా తనకేనంటూ నమ్మకం పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది.

Telugu Cm, Congress, Jana, Komativenkat, Revanth Reddy, Congress Senior-Telugu P

మరో పక్క నల్గొండ ఫైర్ బ్రాండ్ కోమటి రెడ్డి( Komatireddy ) ఎలానూ ఉన్నారు.అయితే ఇప్పుడు లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వచ్చాను అన్నట్లుగా సంగారెడ్డి ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి( Jaggareddy ) కూడా ముఖ్యమంత్రి రేసులో తాను కూడా ఉన్నాను అంటూ ప్రకటించారు.అయితే దీనికి ఆయన టైం లిమిట్ కూడా ప్రకటించడం విశేషం.మరో పది సంవత్సరాలలోపు తాను ముఖ్యమంత్రి అవుతాను అంటూ కొంత వాలిడిటీ ప్రకటించారు.

తద్వారా తాను భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్దినని ఆయన ప్రకటించుకున్నారు .మిగతా నేతలు మాత్రం తమకు అంతఓపిక లేదని ముఖ్యమంత్రి పదవి వెంటనే కావాలంటున్నారు.

Telugu Cm, Congress, Jana, Komativenkat, Revanth Reddy, Congress Senior-Telugu P

అయితే అసలు కాంగ్రెస్కు ఈ స్థాయి ఊపిరి రావడానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి కి( Revanth Reddy ) పిసిసి చీఫ్ పదవి ఇవ్వడమేనని ,తనదైన చాణక్యంతో కేసీఆర్ వ్యతిరేకలందరికి ఒక వేదిక నిర్మించి ఇప్పుడు కాంగ్రెస్ ను ఈ స్థానంలో నిలిపిన రేవంత్ రెడ్డి కి మాత్రమే ముఖ్యమంత్రి పదవి అంటూ ఆయన అనుకూల వర్గం నాయకులు ప్రకటనలు ఇస్తున్నారు.ఇలా అంతర్గత ప్రజాస్వామ్యానికి కేరాఫ్ అడ్రస్ చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ వేదికగా చాలా హంగామానే జరుగుతుంది.మరి పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా అధికారం పై ఆశతో ఎన్నికలను నిర్లక్ష్యం చేస్తే అసలుకే అస్సలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube