పల్నాడు జిల్లాలో వేటకోడవళ్లతో నరికి యువకుడి దారుణ హత్య..!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లోని పల్నాడు జిల్లా జంగమేశ్వర గ్రామం( Jangameshwara village )లో వేట కొడవళ్ళు, గొడ్డళ్లతో నరికి ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు.దీంతో ఆ గ్రామంలో ఉండే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

 A Young Man Was Brutally Killed By Poachers In Palnadu District , Andhra Pradesh-TeluguStop.com

పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.పల్నాడు జిల్లాలోని జంగమేశ్వర గ్రామానికి చెందిన కూనిరెడ్డి కృష్ణారెడ్డి అనే వ్యక్తి పులిపాడు గ్రామంలో ప్రభుత్వ మద్యం షాపు సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు.కూనిరెడ్డి కృష్ణారెడ్డి జంగమేశ్వరం వైఎస్ఆర్సిపిలో యాక్టివ్ గా పని చేసే నేత.సుమారు గా ఐదు మంది ప్రత్యర్థులు ముసుగులు వేసుకుని కూనిరెడ్డి కృష్ణారెడ్డి పై దాడికి పాల్పడ్డారు.కృష్ణారెడ్డి కళ్ళల్లో కారం చల్లి విచక్షణారహితంగా వేట కొడవళ్ళు, గోడ్డలతో నరికారు.కృష్ణారెడ్డి మృతి చెందిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కృష్ణారెడ్డి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు.గురజాల మండలంలోని జంగమేశ్వరం గ్రామంలో ఫ్యాక్షన్ కక్షల వల్ల గొడవలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

కృష్ణారెడ్డిని హత్య చేసిన హంతకులను పట్టుకోవడం కోసం పోలీసులు మూడు స్పెషల్ టీంలుగా ఏర్పడి రంగంలోకి దిగారు.ఈ హత్యకు రాజకీయాలు కారణమా లేదంటే మరే ఇతర కారణాలు ఉన్నాయా అనేది నిందితులు పట్టుబడిన తర్వాతనే వెలుగులోకి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.కృష్ణారెడ్డి హత్యకు గురికావడంతో పల్నాడు( Palnadu District ) జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube