అడవి శేషు డైరెక్షన్లో హీరో రానా కొత్త సినిమా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రానా ( Rana ) ఒకరు లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు.ఇక రానా బాహుబలి సినిమాలో నటించి ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.

 Rana Daggubati Will Do A Movie In Adivi Sesh Direction , Adivi Sesh, Rana, Tolly-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో రానా నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు.

Telugu Adivi Sesh, Baahubali, Prabhas, Rajinikanth, Rana, Tollywood-Movie

ఇక ప్రస్తుతం రానా రజినీకాంత్ హీరోగా నటిస్తున్న 170 సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాలో కూడా భాగమయ్యారని తెలుస్తోంది.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రానా త్వరలోనే అడివి శేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది.అడివి శేష్ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు ఈయన ఎన్నో అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ కథ నేపథ్యంలో ఉన్న సినిమాలను ఇదివరకే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

Telugu Adivi Sesh, Baahubali, Prabhas, Rajinikanth, Rana, Tollywood-Movie

అత్యంత తక్కువ బడ్జెట్ సినిమాలను చేస్తూ భారీ లాభాలను సొంతం చేసుకోవడం అడివి శేష్ ( Adivi sesh ) కి ఎవరు సాటిరారు అయితే త్వరలోనే ఈయన రానాని డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది.తాజాగా ఒక ఆంగ్ల మీడియాతో ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రానా ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.గోవా ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్నప్పుడు ఒకసారి అడివి శేష్ తన రూమ్ లోకి వచ్చి మీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం కానీ మీరు మాత్రం చాలా గ్యాప్ ఇచ్చే సినిమాలలో నటిస్తున్నారు మీకోసం నేను ఒక మంచి కథ తీసుకు వస్తాను తప్పకుండా మీరు నటించాలి అంటూ చెప్పారట దీంతో రానా కూడా ఓకే చెప్పినట్లు తెలిపారు.ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో త్వరలోనే సినిమా రాబోతుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube