వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఎన్ని రికార్డులు సృష్టించిందంటే..!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) టోర్నీ ఆడే పసికూన జట్లలో ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) ఒకటి.అయితే ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ చేరుతుందో లేదో చెప్పలేం కానీ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుత ఆటను ప్రదర్శిస్తూ ఛాంపియన్ టీమ్స్ ను చిత్తుగా ఓడిస్తూ చరిత్రలో నిలిచిపోయే అద్భుత విజయాలను సాధిస్తోంది.

 Afghanistan Team Records In Icc Odi World Cup 2023 Tournment Details, Afghanista-TeluguStop.com

ఏ టోర్నీలో అయిన పసికూన జట్లు సెమీఫైనల్ చేరడం కష్టమే కానీ ఏ జట్లు సెమీ ఫైనల్ చేరాలో డిసైడ్ చేయగలవు.ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టు అదే చేస్తోంది.

ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయాల గురించి ప్రపంచం మొత్తం చర్చించుకుంటుంది.

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టును( England ) పసికూన జట్టు లాగా ఏకంగా 68 పరుగుల తేడాతో మట్టికరిపించి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఘనవిజయం సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇంగ్లాండ్ ఆటగాళ్లతో పాటు ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.తాజాగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టును( Pakistan ) కూడా చిత్తుగా ఓడించింది.

ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ల దూకుడును పాకిస్తాన్ బౌలర్లు అడ్డుకట్ట వేయలేక చేతులు ఎత్తేయడంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఆఫ్ఘఘనిస్తాన్ జట్టు విజయం సాధించింది.

Telugu Afghanistan, England, Icc Odi Cup, Pakistan, Rashid Khan-Sports News క

ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ 2023 టోర్నీలో గెలిచింది రెండు మ్యాచ్లే అయినా ఎన్నో సరికొత్త రికార్డులు జట్టు ఖాతాలో పడ్డాయి.అవి ఏమిటో చూద్దాం.వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

అంతేకాదు ప్రపంచ కప్ లో ( World Cup ) ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్లలో విజయం సాధించడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం.గతంలో జరిగిన ప్రపంచ కప్ లలో ఆఫ్ఘనిస్తాన్ ఎన్నడూ కూడా రెండు విజయాలను సాధించలేకపోయింది.

Telugu Afghanistan, England, Icc Odi Cup, Pakistan, Rashid Khan-Sports News క

ఈ టోర్నీలో రెండు విజయాలను సాధించిన ఆఫ్గనిస్తాన్ జట్టు మరో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది.జట్టు దూకుడు చూస్తుంటే నాలుగు మ్యాచ్లలో కనీసం రెండు అయినా గెలిచే అవకాశాలు లేకపోలేదు.వన్డే వరల్డ్ కప్ లో తొలిసారిగా ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు 50+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.వన్డే ఫార్మాట్ లో టాప్ 3 ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు అర్థ సెంచరీలు చేయడం ఇది మూడోసారి.

ఈ టోర్నీలో సెమీ ఫైనల్ చేరే జట్ల ఫలితాలను ఆఫ్ఘనిస్తాన్ జట్టు కచ్చితంగా తారుమారు చేసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube