#RRR చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ తో ‘గేమ్ చేంజర్( Game Changer )’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.గత ఏడాది నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా లేకపోవడం తో రామ్ చరణ్ ఫ్యాన్స్ వెర్రెక్కిపోయున్నారు.
ప్రతీ రోజు దిల్ రాజు ని ట్యాగ్ చేసి లిరికల్ వీడియో సాంగ్ గురించి అడుగుతూ ఉండేవారు.ఒకానొక సమయం లో కోపం తో బండ బూతులు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
రామ్ చరణ్ పుట్టిన రోజున ఒక స్టైలిష్ పోస్టర్ వదిలారు, ఆ తర్వాత ఒక కాన్సెప్ట్ వీడియో ని రిలీజ్ చేసారు.అంతే ఆ తర్వాత నుండి ఈ సినిమా నుండి ఒక్క అప్డేట్ కూడా రాలేదు.
మధ్యలో మొదటి పాట కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.ఈ పాట అధికారికంగా ఎప్పుడు విడుదల చేస్తారో కూడా చెప్పలేదు.

ఇలా అభిమానులను టార్చర్ చేస్తూ వచ్చిన మూవీ టీం ఎట్టకేలకు ఈరోజు అప్డేట్ వదిలారు.సోషల్ మీడియా లో లీక్ అయినా ‘జరగండి’ పాటని ఈ దివాళీ కానుకగా విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు.ఈ పాటకి సంబంధించిన పోస్టర్ ని ఒకటి విడుదల చెయ్యగా శంకర్ మార్క్ స్పష్టంగా కనిపించింది.కానీ పాట మాత్రం శంకర్ స్టైల్ లో కాకుండా మన రెగ్యులర్ మాస్ మూవీ సినిమాలోని పాటలాగా అనిపిస్తుంది.
శంకర్ సినిమా పాటలు అంటే ఆయన స్టైల్ లో ఉంటాయని ఆశిస్తారు, కానీ ఇక్కడ దానికి పూర్తిగా విరుద్ధంగా ఉండడం తో ఈ సాంగ్ పై నెగటివిటీ ఏర్పడింది.కానీ అది కేవలం రఫ్ ప్రాక్టీస్ సాంగ్ మాత్రమే అని, ఒరిజినల్ సాంగ్ విన్న తర్వాత అందరి అభిప్రాయాలూ మారిపోతాయని అంటున్నారు.
శంకర్ సినిమాలో పాటల చిత్రీకరణ వేరే లెవెల్ లో ఉంటుంది.మన చిన్నతనం నుండి ఇది చూస్తూనే ఉన్నాం.

గేమ్ చేంజర్ లో సాంగ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయని అంటున్నారు మూవీ యూనిట్.ఈరోజు విడుదలైన పోస్టర్ చూస్తేనే అర్థమైపోతుంది, ఇది శంకర్ మార్క్ సాంగ్స్ అని.ఇక విడుదల తర్వాత ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి.ప్రస్తుతం రామ్ చరణ్ వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ కి వెళ్ళాడు.
అక్కడి నుండి తిరిగి రాగానే హైదరాబాద్ లో రెండు వారాల పాటు నాన్ స్టాప్ షెడ్యూల్ ని నిర్వహిస్తారు.మార్చి లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి, వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.







