ఈ ఏడాది ప్రారంభం లో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య( Waltair Veerayya )’ చిత్రం గ్రాండ్ గా విడుదలై ఎలాంటి సంచలన విజయం సాధించిందో మనమంతా చూసాము.వరుస ఫ్లాప్స్ తర్వాత వచ్చిన ఈ సినిమా అభిమానుల్లో నింపిన జోష్ మామూలుది కాదు.
సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం నాన్ రాజమౌళి టాప్ 5 చిత్రాలలో ఒకటిగా నిల్చింది.కేవలం కలెక్షన్స్ పరంగా మాత్రమే కాదు, 50 డేస్ , 100 డేస్ సెంటర్స్ లో కూడా రికార్డు నెలకొల్పింది ఈ చిత్రం.
ఇక అవనిగడ్డ ప్రాంతం లో అయితే ఈ చిత్రం జనవరి నుండి ఇప్పటికీ ఆడుతూనే ఉంది.వీకెండ్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ కూడా నమోదు అవుతున్నాయట.
ఈ మధ్య కాలం లో ఒక సినిమా ఇన్ని రోజులు ఆడడం అంటే సాధారణమైన విషయం కాదు.

ఇకపోతే ఈ చిత్రం ఓటీటీ లో విడుదలై చాలా కాలం అయ్యింది.కానీ టీవీ టెలికాస్ట్ మాత్రం జరిగింది ఈరోజే.దసరా కానుకగా టెలికాస్ట్ అయినా ఈ సినిమాకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి దాదాపుగా మూడు కోట్ల మంది ఈ చిత్రాన్ని వీక్షించినట్టుగా బార్క్ సంస్థ అంచనా వేసింది.మొత్తం మీద ఎంత టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి అనేది వచ్చే వారం బుధవారం రోజు తెలియనుంది.
రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి పర్ఫెక్ట్ సెంటిమెంట్ మరియు ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కిన చిత్రమిది.మెగాస్టార్ కామెడీ టైమింగ్ తో పాటు, రవితేజ( Ravi Teja ) ఎమోషనల్ సన్నివేశాలు సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది.
కేవలం మొదటి టెలికాస్ట్ లో మాత్రమే కాదు, రిపీట్ టెలికాస్ట్ లో కూడా ఈ చిత్రం రికార్డ్స్ ని నెలకొల్పుతుందని అంటున్నారు విశ్లేషకులు.

ఇప్పటి వరకు జెమినీ టీవీ లో రీసెంట్ గా విడుదలైన చిత్రాలలో సరిలేరు నీకెవ్వరూ, మహర్షి, అలవైకుంఠపురం లో చిత్రాలకు అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి.ఆ సినిమాల తర్వాత టెలికాస్ట్ అయినా ఏ చిత్రానికి కూడా ఆ స్థాయి రేటింగ్స్ రాలేదు.ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి మూడు కోట్ల మంది వీక్షించారు అంటే కచ్చితంగా ఈ సినిమాకి కూడా 15 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఒకవేళ ఆ స్థాయి రేటింగ్స్ వస్తే రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి కి అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చిన సినిమాగా ఇదే నిలుస్తుంది.







