పవన్ నీ అందుకే ప్యాకేజీ స్టార్ అంటారు అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..!!

రాజమండ్రిలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ జరగటం తెలిసిందే.ఈ కార్యక్రమం పై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

 Ambati Rambabu Sensational Comments That Pawan Is Called A Package Star Details,-TeluguStop.com

పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏం చేసినా చంద్రబాబు కోసమే చేస్తారన్నారు.చంద్రబాబుతో పాటు లోకేష్ పల్లకిని మోసేందుకు పవన్ సిద్ధమయ్యారని అన్నారు.

ఇదేమి చారిత్రాత్మక కలయిక కాదని 2014 నుండి ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.ఈ విషయాన్ని ఎప్పటినుండో తాము చెబుతున్నట్లు చెప్పుకొచ్చారు.

చంద్రబాబు పవన్ ఇద్దరూ కలిసి వస్తారని ముందు నుంచే చెబుతూనే ఉన్నాము.నెక్స్ట్ ఎన్నికలలో వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తారని ముందు నుంచే చెబుతున్నాము.

ఈ విషయాన్ని జనసైనికులు గమనించాలి.పవన్ కళ్యాణ్ కి విధానం అంటూ ఏదీ లేదు అందుకే ప్యాకేజీ స్టార్ అంటారు.

Telugu Ambati Rambabu, Chandrababu, Janasena, Lokesh, Pawan Kalyan, Tdpjanasena-

ఏది ఏమైనా రెండు పార్టీలు కలిసి వచ్చిన వేరువేరు వచ్చినా తాము ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లు అంబటి రాంబాబు స్పష్టం చేశారు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు ఉన్నాయి కాబట్టి… చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) జరిగిందని చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో చంద్రబాబు కి బెయిల్ రాకుండా తాము అడ్డుకుంటున్నట్లు పవన్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని అన్నారు.కేసు బలంగా.పూర్తి ఆధారాలు ఉన్నాయి.కాబట్టి బెయిల్ దొరకని పరిస్థితి నెలకొంది అని స్పష్టం చేశారు.

చంద్రబాబు దొరికిన దొంగ.రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు.

ఇదే సమయంలో లోకేష్ ప్రాధేయపడితేనే అమిత్ షా కలిశారని.కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో తేలిపోయింది.

జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రజల గుండెల్లో ఉండలేరు.టీడీపీ అంటే తెలుగు రాష్ట్రానికి తెగులు అని అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube