తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలకి సిక్వల్ గా కొన్ని సినిమాలు వచ్చాయి.అయితే అందులో కొన్ని మాత్రమే విజయాలను సాధించగా మరికొన్ని మాత్రం అపజయాల పాలు అయ్యాయి.
ఇక ఇప్పుడు దాదాపు అన్ని సినిమాలు కూడా రెండు పార్టులు గా వస్తున్నాయి.ప్రభాస్( Prabhas ) హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా ఇప్పటికే రెండు పార్టులతో వస్తుందని అనౌన్స్ చేశారు.
ఇక ఆల్రెడీ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప సినిమా( Pushpa movie ) ఆల్రెడీ రెండో పార్ట్ కూడా రెడీ అయింది.
ఇక ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా( Devara movie ) కూడా రెండు పార్ట్ లు గా రిలీజ్ అవుతుందని ఇటీవలే మేకర్స్ తెలియజేయడం జరిగింది.ఇక ఇప్పుడు వస్తున్న అన్ని సినిమాలు కూడా రెండు పార్టులతో వస్తూ ప్రేక్షకులను అలరించడానికి చాలా ఆరాట పడుతున్నాయి.ఇక అందులో భాగంగానే ఇప్పుడు మొత్తం అదే ట్రెండ్ నడుస్తుంది.
ఇక ఈ సినిమాలు సక్సెస్ అయితే ఇంకా ముందు ముందు కూడా సీక్వెల్స్ వచ్చి మంచి గుర్తింపును పొందుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
అయితే ఇలాంటి క్రమంలో ఒకప్పుడు బాహుబలికి ముందు ఒక సినిమాకి సీక్వల్ తీయాలంటే అందరూ భయపడిపోయేవారు ఎందుకంటే అంతకుముందు అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.కానీ ముఖ్యంగా ఆర్య 2, గాయం 2 లాంటి సినిమాలు భారీగా ప్లాప్ అయ్యాయి.దాంతో సీక్వెల్ సినిమాలకు అప్పట్లో ట్రెండ్ అనేది ఎక్కువగా లేదు కానీ ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి ( Baahubali )సినిమా తీశాడో అప్పటినుంచి ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ప్రతి సినిమాలు రెండు పార్టులు గా ప్లాన్ చేస్తున్నారు…
.