మై విలేజ్ షో ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో గంగవ్వ( Gangavva ) ఒకరు.ఈమె తన పల్లెటూరి జీవితం గురించి ఎన్నో రకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు అయితే ఈ వీడియోలు ఎంతో ఫేమస్ అవడంతో గంగవ్వ సెలబ్రిటీగా మారిపోయారు.
ఇక గంగవ్వ యూట్యూబ్ ఛానల్ మెయింటెన్ చేస్తున్నటువంటి వారంతా కూడా ఎంతో ఫేమస్ అయ్యారు అని చెప్పాలి.ఇలా పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వారి జీవన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలన్నింటినీ కూడా గంగవ్వ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలను చేయడంతో ఈమె వీడియోలకు ఎంతో మంచి ఆదరణ లభించేది.

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి గంగవ్వ అనంతరం బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు.ఇలా బుల్లితెరపై పెద్ద ఎత్తునలో సందడి చేస్తున్నటువంటి గంగవ్వ అలాగే ఆమె టీం అంతా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇకపోతే గంగవ్వకు బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలో కూడా అవకాశం వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కొన్ని రోజులపాటు కొనసాగిన గంగవ్వ అక్కడ ఉండలేక అనారోగ్యానికి గురయ్యారు.దీంతో తాను ఉండలేనని వెళ్లిపోతానని బిగ్ బాస్ ను వేడుకోవడంతో నాగార్జున తనని బయటకు పంపించేశారు.

ఇలా బిగ్ బాస్ ద్వారా కొంత మొత్తంలో డబ్బు సంపాదించిన గంగవ్వ అనంతరం నాగార్జున( Nagarjuna ) సహాయంతో కొత్త ఇంటిని నిర్మించిన సంగతి మనకు తెలిసిందే.ఇక గంగవ్వ తనకు సంబంధించిన అన్ని వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటారు అయితే తాజాగా ఈమె తన టీం తో కలిసి దుబాయ్ వెళ్లారని తెలుస్తోంది బతుకమ్మ పండుగ సందర్భంగా దుబాయిలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన దీంతో కలిసి దుబాయిలో గంగవ్వ పడుతున్నటువంటి కష్టాలను ఒక రీల్ ద్వారా అందరితో పంచుకున్నారు.

ఇందులో భాగంగా గంగవ్వతో పాటు తన టీం మొత్తం సరదాగా ఒక రీల్ చేశారు ఫారిన్ వచ్చాం రా వెల్కమ్ టు ఫారిన్ అంటూ గంగవ్వ చెప్పగా వి ఆర్ ఎడ్యుకేటింగ్ కమింగ్ ఫ్రం ఆంధ్ర అంటూ సినిమాలోని డైలాగ్ ద్వారా వీరంతా రీల్ చేశారు.ప్రస్తుతం ఈ రీల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఈ వీడియో పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఎక్స్ట్రా స్పెషల్ దోశ తినడం కోసమే ఫారిన్ వెళ్ళావా అన్న అంటూ కొందరు కామెంట్లు చేయగా మీరు తెలంగాణ వాళ్లు అయిండుకొని ఆంధ్ర నుంచి వచ్చామని చెబుతున్నారు మీరు తెలంగాణ వాళ్లు అని చెప్పుకోవడానికి కూడా అంత నామోషి ఎందుకు అంటూ ఈ వీడియో రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే మరి కొందరు మాత్రం ఈ సినిమా వచ్చిన సమయానికి తెలంగాణ వేరు కాలేదు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా ఒక చిన్న మారుమూల పల్లెలో ఉన్నటువంటి గంగవ్వ ఇలా దేశం దాటి విదేశాలలో సందడి చేస్తుంది అంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో తెలుస్తుంది.







