సాధారణంగా కుటుంబాన్ని ఆర్థిక పరిస్థితులు లేదా వివాహేతర సంబంధాలు( Extramarital affairs ) చిన్న భిన్నం చేస్తాయని తెలిసిందే.ప్రేమించి వివాహం చేసుకున్న దంపతులకు ఆర్థిక పరిస్థితులు వెంటాడకుంటే వారి సంసార జీవితం ఎంతో హ్యాపీగా సాగుతుంది అనుకుంటే అది పొరపాటే.
ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కానిస్టేబుల్ గా ప్రభుత్వ కొలువు సాధించింది.ఆ వ్యక్తి ఓ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.
అయితే ఆ వ్యక్తి తన భార్యను కాల్చి దారుణంగా హత్య చేసిన ఘటన బీహార్( Bihar ) రాజధాని పాట్నాలో( Patna ) చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.జహనాబాద్ కు చెందిన గజేంద్ర యాదవ్ ( Gajendra Yadav )అనే వ్యక్తి ఓ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.ఇతనికి శోభకుమారి( Shobhakumari ) (23) అనే యువతి పరిచయం అయింది.వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.వీరికి ఒక కుమార్తె సంతానం.ఇక వీరి కుటుంబం సంతోషంగా ముందుకు సాగుతోంది.
అయితే శోభ కుమారికి ఇటీవలే కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది.ఇంతవరకు బాగానే ఉంది.
కానీ పోలీస్ ఉద్యోగం లో చేరితే కుటుంబానికి కావలసినంత సమయం కేటాయించడం కష్టం అని తెలిసిందే.శోభ కుమారి కూడా ఉద్యోగంలో చేరినప్పటి నుండి బిజీగా ఉంటూ ఎక్కువ సమయం భర్త కుమార్తెకు కేటాయించకపోవడంతో తరచూ భర్త గజేంద్ర గొడవ పడేవాడు.

ఈ విషయంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో భర్త గజేంద్ర మానవత్వం మరిచి భార్యను చంపేయాలి అనుకున్నాడు.ఈ క్రమంలో ఓ హోటల్లో రూమ్ బుక్ చేసి భార్యను అక్కడికి పిలిచాడు.అక్కడ ఈ దంపతుల మధ్య మళ్లీ మాటల యుద్ధం జరిగింది.క్షణికావేశంలో గజేంద్ర తుపాకితో భార్య శోభకుమారిని కాల్చి చంపేశాడు.ఆమె మరణించిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.







