భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అత్యంత ఉత్కంఠ భరితమైన మ్యాచ్ ఏదంటే.తాజాగా జరిగిన భారత్- న్యూజిలాండ్ మ్యాచ్.
ఈ టోర్నీలో ఈ రెండు జట్లలో ఏ జట్టు తొలి ఓటమిని చవిచూస్తుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా మ్యాచ్ ను వీక్షించారు.గత రికార్డులను పరిశీలిస్తే.
వరల్డ్ కప్ లో న్యూజిలాండ్- భారత్ ల మధ్య 13 సార్లు మ్యాచ్ జరిగితే పది సార్లు న్యూజిలాండ్( New Zealand ) విజయం సాధించింది.కేవలం మూడుసార్లు భారత్ విజయం సాధించింది.
ప్రపంచ కప్ 2003 లో న్యూజిలాండ్ పై భారత్ గెలిచింది.ఆ తరువాత 2007, 2011, 2015, 2019 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ చేతుల్లో భారత్ ఓటమిని చవిచూసింది.20 ఏళ్ల తర్వాత రోహిత్ సేన న్యూజిలాండ్ ను మట్టి కరిపించింది.

తాజాగా జరిగిన మ్యాచ్ ను పరిశీలిస్తే.భారత జట్టులో శార్దూల్ ఠాగూర్ స్థానంలో మహమ్మద్ షమి( Mohammed Shami )ని తీసుకోవడం జట్టుకు బాగా కలిసి వచ్చింది.న్యూజిలాండ్ జట్టు 300 లకు పైగా పరుగులు చేస్తుందని అనుకున్నారు.
కానీ మహమ్మద్ షమీ కీలక సమయాలలో వికెట్లను తీస్తూ కివీస్ ను 273 కే పరిమితం చేశాడు. షమీ న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేసి ఏకంగా ఐదు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు.
ఈ మ్యాచ్లో భారత జట్టు బౌలింగ్ లో మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు.

భారత జట్టు బ్యాటింగ్ విషయానికి వస్తే.కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) తో పాటు గిల్ మంచి శుభారంభం అందించాడు.అయితే భారత బ్యాటర్లను కట్టడి చేసేందుకు న్యూజిలాండ్ బౌలర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు.
కానీ విరాట్ కోహ్లీ( Virat Kohli ) విధ్వంసక బ్యాటింగ్ ను ఆపలేకపోయారు.విరాట్ కోహ్లీ రన్స్ చేజింగ్ లో శ్రేయస్ అయ్యర్ తో పాటు రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
భారత జట్టు బౌలింగ్ లో మహమ్మద్ షమీ, బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించి భారత జట్టుకు విజయం అందించారు.వీరితోపాటు మిగతా భారత ఆటగాళ్లు కూడా రాణించారు.







