పండుగలు( Festivals _ వస్తే చాలు.వివిధ రకాల ఆఫర్లు కోకొల్లలుగా మనలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి.
అవును, కస్టమర్లను విరివిగా ఆకట్టుకోవడానికి చిత్ర విచిత్రమైన ఆఫర్లు పెడుతుంటారు.ఒక చీర కొంటే మరో చీర ఉచితం అని, 50 శాతం తగ్గింపు అని కొందరు, ఏకంగా వంద శాతం తగ్గింపు అని మరికొందరు, షాపింగ్ చేసి కూపన్ ఉపయోగించి కార్లు, బైక్‌లను గెలుచుకోండి అంటూ భారీగా ఆఫర్ల వర్షం కురిపిస్తుంటారు.
కాగా ప్రస్తుతం దసరా, దీపావళి పండుగల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రధాన దుకాణాల్లో భారీ ఆఫర్లు( Offers ) ప్రకటించారు.దాంతో పండుగ షాపింగ్‌తో ప్రజలు బిజీబిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే సూర్యాపేట( Suryapet )లోని ఓ దుకాణం నిర్వాహకులు మహిళలకు అదిరిపోయే పండుగ ఆఫర్ ఇవ్వగా అది కాస్త హాట్ టాపిక్ అవుతోంది.పట్టణంలోని విఘ్నేశ్వర సిల్క్ సెంటర్ యజమానులు( Vigneshwara Silk Center ) దసరా పండుగ సందర్భంగా తమ దుకాణాన్ని రీఓపెన్ చేశారు.ఇందులో భాగంగా కేవలం 10 రూపాయలకే పట్టుచీర అంటూ ఓ బంపర్ ఆఫర్ పెట్టారు.ఈ అద్భుతమైన ఆఫర్ రెండు రోజుల పాటు ఉంటుందని ప్రకటించడంతో మహిళలు చీరల కోసం కిలోమీటర్ల మేర బారులు తీరారు అంటే మీరు నమ్ముతారా?

కాగా ఈ ఆఫర్ కింద ఇప్పటివరకు దాదాపు 600 చీరలను( 600 Sarees ) విక్రయించినట్లు తెలుస్తోంది.ఈ ఆఫర్ వల్ల షాపు కిక్కిరిసిపోయిందని, కస్టమర్లు తమ షాపుకు ఎక్కువగా వస్తున్నారని దుకాణదారులు మిక్కిలి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పైసా ఖర్చు లేకుండానే వారికి పబ్లిసిటీ వస్తుందని తెగ సంబరపడుతున్నారు.రూ.10లకే పట్టుచీరలు ఇస్తుండటంతో జిల్లాలో సదరు షాపు పేరు కూడా మారుమ్రోగుతోంది.అయితే ఈ ఆఫర్ కూడా రెండే రోజులు వుంటుంది అనడంతో అక్కడ తోపులాటలు జరిగినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.







