పవన్ కళ్యాణ్ 'ఓజీ' హిందీ ప్రొమోషన్స్ కోసం ఆ బాలీవుడ్ స్టార్ ని ఫుల్లుగా వాడేయబోతున్నారా ?

పవన్ కళ్యాణ్(Pawan Kalyan ) ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను నెలకొల్పిన చిత్రం ‘ఓజీ( OG movie )’.సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

 Is Pawan Kalyan Going To Make Full Use Of That Bollywood Star For Og Hindi Prom-TeluguStop.com

మొన్నీమధ్యనే షూటింగ్ ప్రారంభించుకున్నట్టు అనిపిస్తున్న ఈ సినిమా, అప్పుడే 70 శాతం పూర్తి చేసుకుందట.పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మలేసియా షెడ్యూల్ ఒక్కటే ప్రస్తుతానికి బ్యాలన్స్ ఉందట.

అది పూర్తి అయితే సినిమా మొత్తం అయిపోయినట్టే అని, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు చెప్తున్నారు.కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పై ద్రుష్టి సారించాడు.

ఒకపక్క ‘వారాహి విజయ యాత్ర’ చేస్తూ, మరోపక్క ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు పవన్ కళ్యాణ్.#OG చిత్రానికి డేట్స్ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఇచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది.

Telugu Aamir Khan, Bollywood, Hindi, Pawan Kalyan, Sujeeth, Tollywood, Ustaad Bh

ఇది ఇలా ఉండగా ఈ సినిమాని కేవలం తెలుగు లో మాత్రమే కాదు, హిందీ మరియు తమిళ భాషల్లో కూడా విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఎదో చేస్తున్నాం కదా అంటే చేస్తున్నాం అన్నట్టు కాకుండా, హిందీ లో చాలా అగ్రెసివ్ గా ప్రొమోషన్స్ చెయ్యడానికి మూవీ టీం ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.హిందీ లో నిర్వహించబోయ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అమీర్ ఖాన్ ని ముఖ్య అతిథిగా పిలవబోతున్నారు అట.అమీర్ ఖాన్ కి చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో గౌరవం.ముఖ్యంగా అమీర్ ఖాన్( Aamir Khan ) ‘దంగల్’ మూవీ ప్రొమోషన్స్ కి వచ్చినప్పుడు నా అభిమాన టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ అని బహిరంగంగా తెలిపాడు.అందుకే పవన్ కళ్యాణ్ హిందీ డెబ్యూ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయనని పిలిస్తే బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారు.

Telugu Aamir Khan, Bollywood, Hindi, Pawan Kalyan, Sujeeth, Tollywood, Ustaad Bh

ఇప్పటికే పవన్ పుట్టినరోజు నాడు విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కి టాలీవుడ్ ఆడియన్స్ తో పాటుగా బాలీవుడ్ ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇదే ఊపు లో సాంగ్స్ కూడా హిట్ అయ్యి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా వస్తే చిత్రం పై బాలీవుడ్ ఆడియన్స్ లో కూడా అంచనాలు భారీ రేంజ్ లో పెరుగుతాయని అంటున్నారు విశ్లేషకులు.ఒకవేళ సినిమా కి మంచి టాక్ వస్తే ఆ హైప్ మీద అద్భుతమైన ఓపెనింగ్ వసూళ్లు దక్కుతాయని ఆలోచిస్తున్నారు.ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube