రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట పెద్దమ్మ దేవాలయంలో, రెండు కిరాణా షాపులలో దొంగతనం చేసిన దుండగులు.గ్రామస్తుల కథనం ప్రకారం తంగళ్ళపల్లి మండలంలోని రాళ్ళపేట గ్రామంలో గల పెద్దమ్మ ఆలయంలో హుండీ పగలగొట్టి హుండీలోని డబ్బులను, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
అంతేగాకుండా అదే గ్రామానికి చెందిన షేక్ గోరేమియా, సయ్యద్ గోరిబీ కిరాణా షాపుల తాళాలు పగలగొట్టి సుమారు 5వేల కిరాణా సామాగ్రి, డబ్బులను దొంగలించారని గ్రామస్తులు తెలిపారు.వివరాలు తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







