రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యాభై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతం అన్ని విధాల దోపిడీకి గురైంది సాగునీళ్లు, త్రాగునీళ్లు లేక ప్రజలు ఊర్లను వదిలి వలసపోయారని, కేసీఆర్ సీఎం అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి పడావుపడ్డ భూములకు సాగు నీళ్లు అందించి రైతుల కళ్ళలో చిరునవ్వులు చూస్తున్నారని పేర్కొన్నారు.మానకొండూర్ ఎమ్మెల్యే గా మూడవ సారి కూడా రసమయి బాలకిషన్ ను హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారని పేర్కొన్నారు.
మానకొండూర్ నియోజకవర్గములో రసమయి బాలకిషన్( Rasamayi Balakishan ) కి వస్తున్న ప్రజాధరణను ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు కుటిల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేందుకు కాంగ్రెస్( Congress ) కుట్రలు చేస్తున్నదని,కేసీఆర్ వస్తే సర్వమత సమ్మేళనం జరుగుతున్నదని,అన్నీ కులాలను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూస్తోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ కుల, మత రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.ఎన్నికలు వస్తేనే ఊర్లలోకి వచ్చే పగటి వేశగాళ్ళు కాంగ్రెస్ నాయకులని, ఐదేళ్లకు ఒకసారి వచ్చే నాయకులు కావాలా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేసే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నే భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.
కేసీఆర్ సర్కారును మరోసారి ఆశీర్వదించి మూడవ సారి పట్టం కట్టాలని సారూ కారు కేసీఆర్ సర్కారు అనే నినాదంతోనే ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు.మళ్లీ అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్ ఐదు వేల పదహారు , వికలాంగులకు ఆరువేల పదహారు , నాలుగు వందల లకే గ్యాస్ సిలిండర్, కేసీఆర్ బీమా( KCR Bheema ) ప్రతి ఇంటికి ధీమా పథకం ద్వారా ఐదు లక్షలు, కేసీఆర్ ఆరోగ్యరక్ష పదిహేను లక్షలకు పెంపు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, రైతుబంధు ఎకరాకు పదహారు వేలు, సౌభాగ్యలక్ష్మి పథకం మూడు వేల సాయం, అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం, మహిళా సంఘాలకు సొంత భవనాలు హామీలను మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని,అధికారంలోకి రాగానే అమలు చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు చెరుకుపెల్లి రాజిరెడ్డి, గూడెపుపల్లి సర్పంచ్ మల్లారెడ్డి, అనంతగిరి ఎంపీటీసీ పర్శరాం, బీఆర్ఎస్ మండల మహిళ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, నాయకులు వడియాల సత్యనారాయణ రెడ్డి,ర్యాగటి రమేష్, శ్రీనివాస్, బాబు,తిరుపతి,సత్యనారాయణ రెడ్డి,రమేష్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ముత్యం రాములు తదితరులు పాల్గొన్నారు.







