Akkineni Akhil Venu Swamy: అఖిల్ జాతకం గురించి మరో బాంబు పేల్చిన వేణు స్వామి…అప్పటి వరకు అంతే అంటూ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి.కుటుంబం నుంచి నాగార్జున (Nagarjuna ) ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే నాగార్జున వారసులుగా నాగచైతన్య (Nagachaitanya) అఖిల్ (Akhil) ఇండస్ట్రీలోకి వచ్చారు.

 Venu Swamy Viral Comments On Akkineni Akhil Full Details Inside-TeluguStop.com

కానీ అఖిల్ మాత్రం పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.నాగచైతన్య సినిమా కెరియర్ పరంగా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ అఖిల్ మాత్రం సక్సెస్ కాకపోవడంతో ఈయన కెరియర్ ఇబ్బందులలో పడిందనే చెప్పాలి.

అయితే ఇదివరకే అఖిల్ నాగచైతన్య జాతకం గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే తాజాగా వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అఖిల్ జాతకం గురించి మరొక వార్త తెలియజేశారు.

Telugu Akkineni Akhil, Akkineniakhil, Anikha Surendar, Naga Chaitanya, Nagarjuna

అక్కినేని నాగార్జున ఇంట్లో ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ( Divorce ) తీసుకున్నటువంటి వారు ఉన్నారు.ఇక నాగచైతన్య కూడా సమంతను( Samantha ) పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే వీరివిడాకుల విషయాలు ముందుగా వేణు స్వామి తెలియజేశారు.ఇక అఖిల్ పెళ్లి చేసుకున్న కూడా విడాకులు తీసుకుంటారని ఈయన గతంలోనే చెప్పారు కానీ వీరు పెళ్లి జరగకుండా నిశ్చితార్థంతోనే ఆగిపోయింది.

ఇకపోతే ఈ మధ్యకాలంలో సమంత నాగచైతన్య తిరిగి కలవబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి.ఈ విషయం గురించి వేణు స్వామిని ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.

Telugu Akkineni Akhil, Akkineniakhil, Anikha Surendar, Naga Chaitanya, Nagarjuna

నాగచైతన్య సమంత తిరిగి కలుసుకోబోతున్నారా అన్న ప్రశ్నకు వేణు స్వామి( Venu Swamy ) సమాధానం చెబుతూ అసలు అవకాశం లేదని వారిద్దరూ ఇకపై కలుసుకోరు అంటూ సమాధానం చెప్పారు.అఖిల్ జాతకం( Akhil Astrology ) గురించి మాట్లాడుతూ అఖిల్ జాతకం గురించి చెప్పడానికి ఏమీ లేదు అఖిల్ ఇప్పుడు తన తల్లి మాట వింటున్నారు.ఈమె అఖిల్ బాగోగులన్నీ చూసుకునే వరకు అఖిల్ జాతకం ఇలాగే ఉంటుందని తెలిపారు.తల్లిదండ్రులు రవిచంద్రులతో సమానం అంటారు అందుకే ఈయన జాతకం ప్రకారం తన తల్లి మాట విన్నంతవరకు ఈయన జాతకంలో ఏమాత్రం మార్పు ఉండదని జీవితంలో విజయాలు కూడా ఉండవని వేణు స్వామి తెలియజేశారు.

ఎప్పుడైతే నాగార్జున అఖిల్ బాధ్యతలను తీసుకుంటారో అప్పుడే ఆయనకు మంచిగా ఉంటుందని వేణు స్వామి తెలిపారు.

Telugu Akkineni Akhil, Akkineniakhil, Anikha Surendar, Naga Chaitanya, Nagarjuna

ఇక నాగార్జున నాగచైతన్య జాతకంలో మాదిరిగానే ఈయన జాతకంలో కూడా దోషం ఉందని తద్వారా ఈయన ఇప్పుడు పెళ్లి చేసుకున్న కూడా విడాకులు తీసుకోవడం కాయమే అంటూ వేణు స్వామి మరోసారి అఖిల్ జాతకం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.అఖిల్ జాతక దోషం ప్రకారం ఆయన వృత్తి పరమైన వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉండరని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక అఖిల్ కూడా నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఎంతో అద్భుతమైన నటనతో డాన్సులతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసిన ఈయన మాత్రం ఇప్పటివరకు సక్సెస్ కాలేకపోయారు.

అఖిల్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన తాజాగా ఏజెంట్ సినిమా( Agent Movie ) ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఈయన ఇండస్ట్రీకి ప్రస్తుతం దూరంగా ఉన్నారు.

ఇలా అఖిల్ జాతకం గురించి వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube