గజ్వేల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలతో మరికాసేపటిలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ కీలక సమావేశం కానున్నారు.మేడ్చల్ జిల్లాలోని అంతాయపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఈ భేటీ జరగనుంది.
ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల ప్రచారంతో పాటు స్థానిక పరిస్థితులపై నేతలను కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.కాగా ఈ భేటీలో కేసీఆర్ తో పాటు మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది.
అయితే గజ్వేల్ లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన కేసీఆర్ జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే.







