కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీఎం జగన్ పర్యటన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీఎం జగన్ పర్యటించారు.ఇందులో భాగంగా నాలుగో విడత జగనన్న చేదోడు నిధులను ఆయన విడుదల చేశారు.

 Cm Jagan's Visit To Emmiganoor Of Kurnool District-TeluguStop.com

ఈ పథకంలో భాగంగా అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, ట్రైలర్లకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం జమ చేశారు.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,25,020 మందికి రూ.325.02 కోట్ల ఆర్థికసాయం అందించింది.నాలుగేళ్లలో జగనన్న చేదోడు కింద రూ.1252.52 కోట్ల సాయం అందించామని సీఎం జగన్ తెలిపారు.

ఇచ్చిన హామీలను నాలుగేళ్లలో అమలు చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు.గతంలో ఎందుకు అభివృద్ధి జరగలేదో ప్రజలు ఆలోచించాలన్నారు.అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశామన్న సీఎం జగన్ కుప్పం ప్రజలకు కూడా చంద్రబాబు చేసిందేమీ లేదని చెప్పారు.

కుప్పంలో మన ప్రభుత్వమే ఇళ్ల స్థలాలు ఇచ్చిందన్న సీఎం జగన్ చంద్రబాబు పాలనలో సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేశారని పేర్కొన్నారు.

ఈ క్రమంలో గత ప్రభుత్వం, మన ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని సూచించారు.మ్యానిఫెస్టోను చెత్త బుట్టలో పడేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube