అసెంబ్లీ ఎన్నికల కోడ్( Assembly Election Code ) అమలులో ఉన్నందున జిల్లాలో అధికారులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని అన్నారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హల్ లో జిల్లా కలెక్టర్ సహాయ వ్యయ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు,వి ఎస్ టి, వి వి టి ,ఎస్ ఎస్ టి , అకౌంటింగ్ బృందాలకు దిశా నిర్దేశం చేశారు.
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఈ బృందాలు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు సెలవు దినాల్లో కూడా నిఘా పెంచాలన్నారు.సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తనిఖీలు చేపట్టాలన్నారు.
ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా తనిఖీలు( Checkposts Checking ) నిర్వహించాలని, స్టాటిక్ సర్వేయలెన్స్ అధికారులు ప్రతీ వాహనాన్ని వీడియోగ్రఫీతో తనిఖీ నిర్వహించాలని, వాహనాల తనిఖీ, జప్తు చేసినటువంటి నగదు,ఇతర సమాచారానికి సంబంధించిన రికార్డు సమాచారాన్ని, నిర్దిష్ట ఫార్మాట్ లలో సంబంధిత అధికారుల ద్వారా రోజువారీగా పంపించాలని చెప్పారు.
జప్తు చేసిన వాటికి రశీదు ఇవ్వాలని అన్నారు.రాత్రి సమయాలల్లో పలు జాగ్రత్తలతో తనిఖీలు నిర్వహించాల్సిందిగా బృంద సభ్యులకు సూచించారు.ప్రతీ వాహనాన్ని తనిఖీ చేపట్టాలని, డబ్బు, మద్యం, రవాణాను అరికట్టాలని బృంద సభ్యులకు సూచించారు.వ్యయ పరిశీలకులు వచ్చే లోగా మరోసారి సభ్యులకు ట్రైనింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో మాస్టర్ ట్రైనర్ ఉపేందర్ , జిల్లా అడిట్ అధికారి స్వప్న, డిప్యూటీ రిజిస్ట్రార్ రామకృష్ణ, ట్రైనింగ్ పర్యవేక్షకులు,సీపీవో పీబి శ్రీనివాస చారి, తదితరులు పాల్గొన్నారు.