టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి హీరో తమ సినిమాలను బాగా ప్రచారం చేసుకుంటారు.లైవ్ ప్రమోషనల్ ఈవెంట్స్ నుంచి యూట్యూబ్ ఇంటర్వ్యూల వరకు అన్ని మాధ్యమాలను వాడుకుంటారు.
అయితే ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు నెగిటివ్ ప్రశ్నలు( Negative Questions ) వేస్తే మనవాళ్ళకి యమ కోపం వస్తుంది.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో( Bollywood ) ఇంటర్వ్యూ చేసే వారి నుంచి విలేకరుల వరకు అందరూ చాలా స్వేచ్ఛగా తమకు నచ్చిన ప్రశ్న వేస్తారు.
ఉదాహరణకు రష్మికను( Rashmika ) మొన్న బాలీవుడ్ మీడియా యానిమల్ సినిమాలోని( Animal Movie ) ముద్దు గురించి నేరుగా అడిగింది.అక్కడ దానిని దాటు వేసే ప్రయత్నం చేయకుండా రష్మిక ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది.
ఇతర ఇండస్ట్రీలలో కూడా నెగిటివ్ ప్రశ్నలు అయినా సరే సూటిగా అడిగేస్తుంటారు.మన టాలీవుడ్ హీరోల( Tollywood Heros ) వద్దకు వచ్చేసరికి ఆ ఫ్రీడమ్ ఉండదు.
వరుసగా పది చెత్త సినిమాలు తీసి నిర్మాతలను అప్పుల ఊబిలో ముంచెత్తిన హీరోని కూడా పొగుడుతూ ప్రశ్నలు అడగాలే తప్ప నెగిటివ్ గా అసలు అడగకూడదు.సినిమా కథ ఎంత చెత్తగా ఉన్నా సరే అవన్నీ మర్చిపోయి సినిమా ప్లస్ పాయింట్స్ గురించే మాట్లాడాలి.
లేదంటే “మీరు బాగున్నారు, సార్, సినిమాలో బాగా కనిపించారు, బాగా యాక్టింగ్ చేశారం”టూ డప్పు కొట్టాలి.పోస్టర్లు, టీజర్లలో ఏవైనా అసభ్యకర కంటెంట్ కనిపించినా సరే వాటి గురించి అసలు ప్రస్తావించకూడదు.
ఇక ప్రింట్ మీడియా హీరోలకు వ్యతిరేకంగా ఏవైనా ప్రశ్నలు వేసినా వాటి ప్రింటింగ్ చివరి అంకంలో ఆగిపోతుంటుంది.యూట్యూబ్ ఇంటర్వ్యూస్ కి ( Youtube Interviews ) వచ్చేముందే నెగటివ్ ప్రశ్నలు వేయకుండా తమ సినిమాను ప్రమోట్ చేసేలా ఉండేలా హీరోలు షరతులు పెడుతుంటారు.ఎలక్ట్రానిక్ మీడియా పరిస్థితి కూడా అలానే ఉంటుంది.సురేష్ కొండేటి( Suresh Kondeti ) వంటి జర్నలిస్టులు ధైర్యం చేసి ప్రశ్నలు అడుగుతున్నా హీరోలు వెంటనే నొచ్చుకుంటున్నారు.
ఫ్లాప్ సినిమాలు గురించి అసలు అడగొద్దు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
సినిమాని ప్రచారం మాత్రమే చేయాలంటూ నెగిటివ్ ప్రశ్నలు అడగవద్దంటూ మన టాలీవుడ్ హీరోల తీరు ఉంటోంది.చాలామంది ఈ తీరును ఎండ కడుతున్నారు.స్వేచ్ఛగా ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చే ధైర్యం మన హీరోలకు లేదంటూ కొందరు ఘాటైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.
ఏది ఏమైనా ఇప్పట్లో మన హీరోలు ప్రతికూల ప్రశ్నలను ఫేస్ చేస్తే పరిస్థితుల్లో లేరని తెలుస్తోంది.