బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పరిణితి చోప్రా( Parineeti Chopra ) తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా( Raghav Chadha ) ను వివాహం చేసుకున్నారు.
చిన్నప్పటినుంచి స్నేహితులు కావటం విశేషం ఇలా స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ ప్రేమలో పడి వీరి ప్రేమ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్తలు పడ్డారు.ఇలా ప్రేమించుకున్నటువంటి ఈ జంట గత నెల ఎంతో అంగరంగ వైభవంగా ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో వివాహం చేసుకున్నారు.
ఇలా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.పెళ్లయినటువంటి ఈ జంట తమ హనీమూన్ చాలా గ్రాండ్ గా చేస్తారని అందరూ భావించారు.అయితే తాజాగా ఈమె మాల్దీవ్స్ వెకేషన్ లో భారీగా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది.తాజాగా పరిమితి చోప్రా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఫోటో వైరల్ అవుతుంది.
మాల్దీవ్ ( Maldives ) వెకేషన్ లో భాగంగా ఈమె స్విమ్ చేస్తూ సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ ఎంతో చిల్ అవుతున్నారు.అయితే ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈమె వెరైటీ క్యాప్షన్ జోడించారు.
ఈ ఫోటోని షేర్ చేసినటువంటి పరిణితి ఇది హనీమూన్ ( Honeymoon ) ఫోటో కాదు.ఈ ఫోటో తన ఆడపడుచు తీశారని ప్రస్తుతం మేమంతా కలిసి వెకేషన్ లో ఉన్నామంటూ ఈమె చెప్పుకొచ్చారు.ఇలా పెళ్లయిన కొత్త జంట భర్తతో హనీమూన్ వెళ్లకుండా గర్ల్స్ తో కలిసి ట్రిప్ వెళ్లడం ఏంటి అని ఒక్కసారిగా నెటిజన్స్ ఆశ్చర్య పోవడమే కాకుండా ఈ ఫోటోపై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.పెళ్లయిన నెలకి భర్తను పక్కన పెట్టేసి ఇలా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేయగా కొత్తగా పెళ్లయిన జంట భర్తతో హనీమూన్ వెళితే ఆ మధుర జ్ఞాపకాలే వేరు అంటూ మరికొందరు ఈ ఫోటోపై విభిన్న రీతిలో కామెంట్లు చేస్తూ ఈమెను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.