మెగా కుటుంబం లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటి సారిగా తొలి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Icon star Allu Arjun ) రికార్డ్ క్రియేట్ చేసారు.దీంతో అల్లు ఫ్యాన్స్ మామూలు సంతోషంగా లేరు.
బన్నీకి జాతీయ అవార్డు( National Award ) రావడంతో తెలుగు ఇండస్ట్రీ నుండి మాత్రమే కాకుండా పక్క ఇండస్ట్రీల నుండి కూడా ప్రశంసలు దక్కాయి.ఇక తమ అభిమాన హీరోకి అవార్డు రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆకాశంలో తేలిపోతున్నారు.
ఈ విషయంలో బన్నీ సైతం ఖుషీగా ఉన్నారు.పుష్ప సినిమాకు తాను పెట్టిన ఎఫర్ట్ కు తగిన ఫలితం అయితే రావడంతో ఈయన కూడా మస్తు ఖుషీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా బన్నీ నేషనల్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు.

నిన్న ఈ వేడుక జరుగగా బన్నీ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.మరి ఈ అవార్డు అందుకున్న తర్వాత ఒక పోస్ట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.తన భార్య స్నేహ, తల్లిదండ్రుల ఫోటోలను షేర్ చేస్తూ మర్చిపోలేని రోజు నా చుట్టూతా మర్చిపోలేని నా వాళ్లతో అవార్డు తీసుకున్న అంటూ ఈయన చెప్పుకొచ్చాడు.
పిక్స్ కూడా షేర్ చేయడంతో ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ పోస్ట్ చూసి మరోసారి బన్నీకి శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమాకు సీక్వెల్ గా ”పుష్ప ది రూల్”( Pushpa the Rule ) చేస్తున్నాడు.లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
ఇక ఈ సినిమా 2024 ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.ఈసారి ఇంకెన్ని అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.








