కాంగ్రెస్ పార్టీలో చేరిక వ్యవహారంపై నేత రేవూరి ప్రకాష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీలో చేరాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానించారని తెలిపారు.
రేపు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరతానని రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.అదేవిధంగా రేవంత్ రెడ్డి పరకాల ప్రతిపాదన చేశారన్న ఆయన పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను ఒప్పుకున్నట్లు వెల్లడించారు.
బండి సంజయ్ వలన ఎంతగానో ఇబ్బంది పడినట్లు తెలిపారు.బండి సంజయ్ పార్టీలో తనకు నష్టం చేసేలా వ్యవహరించారన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి రాజకీయంగా కేసీఆర్ ను తట్టుకోవాలంటే కిషన్ రెడ్డి సరిపోరన్నారు.
అయితే ఆ స్థాయి బీజేపీలో కేవలం ఈటల రాజేందర్ కు మాత్రమే ఉందని వెల్లడించారు.
.






