భారత్ వేదికగా అక్టోబర్ ఐదున మొదలైన వన్డే వరల్డ్ కప్ లో( ODI World Cup ) పాల్గొన్న పది జట్ల మధ్య గెలుపు కోసం ఉత్కంఠ భరిత మ్యాచ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నవంబర్ 19న జరుగనున్న సంగతి కూడా తెలిసిందే.
ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచే నాలుగు జట్లు మాత్రమే సెమీఫైనల్ చేరతాయి కాబట్టి బ్యాట్స్ మెన్ లు ఒకరికి మించి మరొకరు పరుగుల వర్షం కురిపిస్తున్నారు.
ప్రతి బ్యాట్స్మెన్ సెంచరీ చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో ఎన్నో సరికొత్త రికార్డులను తమ పేరుపై వన్డే ప్రపంచ కప్ చరిత్రలో లిఖిస్తున్నారు.ఎవరు బ్రేక్ చేయడానికి వీలు కానీ సరికొత్త రికార్డులు కూడా ఈ టోర్నీలో నమోదు అవుతూ ఉండడంతో ప్రేక్షకులకు ఈ ప్రపంచకప్ ఓ కన్నుల పండుగ లాగా ఉంది.
వన్డే వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

మహమ్మద్ రిజ్వాన్:
పాకిస్తాన్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ ఆడిన మూడు మ్యాచ్లలో 248 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.ఈ టోర్నీలో ఒక సెంచరీ, ఒక అర్థ సెంచరీ నమోదు చేశాడు.ఇతని అత్యధిక స్కోరు 131.
డెవాన్ కాన్వే:
న్యూజిలాండ్ జట్టు ప్లేయర్ డెవాన్ కాన్వే( Devon Conway ) ఆడిన మూడు మ్యాచ్లలో 229 పరుగులు చేశాడు.ఇందులో ఒక సెంచరీ ఉంది.ఇతని అత్యధిక స్కోరు 152.
రోహిత్ శర్మ:
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohith Sharma ) ఆడిన మూడు మ్యాచ్లలో 217 పరుగులు చేశాడు.ఇందులో ఒక సెంచరీ, ఒక అర్థ సెంచరీ ఉంది.ఇతని అత్యధిక స్కోరు 131.

క్వింటన్ డి కాక్:
దక్షిణాఫ్రికా ఆటగాడైన క్వింటన్ డి కాక్( Quinton De Cock ) ఆడిన రెండు మ్యాచ్లలో 209 పరుగులు చేశాడు.ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.ఇతని అత్యధిక స్కోరు 109.
కుశల్ మెండీస్:
శ్రీలంక ఆటగాడు అయిన కుశల్ మెండిస్( Kusal Mendis ) ఆడిన రెండు మ్యాచ్లో 198 పరుగులు చేశాడు.ఇందులో ఒక సెంచరీ, ఒక అర్థ సెంచరీ ఉంది ఇతని అత్యధిక స్కోర్ 122.







